కలల అలలు

తరుణి బాల చిత్రం

ఎదురీదడం ఏమరుపాటుదనం
ఎంతో దూర పయనమయి
అరచేతికి అందివచ్చినప్పుడు
నక్షత్ర లోకం నీదవుతుంది

భూమి నీరు ఏక వేదిక
నింగీ నీ మనసూ మరో లోకం
వెలుగు నీడల జీవితానికి
కేతనమెగరేసే సుందర దృశ్యం

రాత్రి దిగ్గజ రూపమే
ఊహల ఊపిరులైనప్పుడు
కెరటాల పై తెరచాపలా
చీకటి మాటున వెలుగు ప్రతిఫలనమవుతుంది
చుక్కల మెరుపులా
చూపు బాణమై
గ్రహంతరాళలో పరిభ్రమణమౌతుంది
సుందర దృశ్యమూ అవుతుంది

చిత్ర కారిణి అనన్య మంత్రవాది

 

చిత్ర కవిత రచన డాక్టర్ కొండపల్లి నీహారిణి

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

నుడిక్రీడ