పుట్టింటి చదువు సంగీతం సంస్కారం తో పెరిగిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి ఆకాశవాణి లో పత్రికారంగంలో ప్రసిద్ధి చెందారు.ఆమె జానకీబాల గారు.అమ్మనాన్నలు సూరి లక్ష్మి నర్సమాంబ రామచంద్ర శర్మ గార్లు.తణుకులో హైస్కూల్ విద్యముగిశాకAPSRTCలో ఉద్యోగం చేస్తూ ఎన్.ఆర్.చందూర్ గారి మాసపత్రిక జగతిలో వ్యాసాలు రాసేవారు.ఆంధ్రపత్రికలో మరోమలుపు అనే మొదటికథ ప్రచురణ తోపాటు1966లో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి తో పెళ్ళిఓ అందమైన మలుపు.
మామగారు హనుమచ్ఛాస్త్రి గారు జగమెరిగిన బ్రాహ్మణులు.ఇటు ఉద్యోగం అటు సాహిత్య సంగీత రంగంలో తమ ప్రతిభను చాటుకున్నారు ఈమె.
450పేజీల కథాసంపుటి సువర్ణ రేఖ అంతరంగతరంగాలు కథలఏగఆక14నవలలు రాశారు.ప్లేబాక్ సింగర్స్ జీవిత విశేషాలతో కొమ్మ కొమ్మ కోయిలమ్మ రాసినవి పాఠకులను అలరించాయి.దుర్గాబాయ్ దేశ్ముఖ్ శ్రీరంగం గోపాలరత్నం గార్ల జీవిత చరిత్రలు చిన్న పిల్లల కోసం పుస్తకాలు రాశారు.మన సినిమాలో చందమామ పాటల్ని వివరణతో విశ్లేషణాత్మక రచనలు చేశారు.పాత లలిత గీతాల పరిచయాలు తెలుగు సినిమా కళాకారుల మీద ఆర్టికల్స్ రాశారు.నెచ్చెలి అంతర్జాల పత్రికలో ఈమె రావు బాలసరస్వతి దేవి అంజలీదేవి మొదలైన మన ముందు తరాలవారి విశేషాలు రాసి మనకు అందుబాటులో తేవటం ఓవిశేషం.పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం పొందారు.ఈమె ప్రసంగాలు రేడియో లో హైదరాబాద్ కేంద్రం నుంచి అడపాదడపా ప్రసారం ఔతుంటాయి.భావన లో ఈమె గళం వినే సౌభాగ్యం నాకు కల్గింది.