ప్రపంచ అంతరిక్ష వారం ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు వారం రోజులు నిర్వహిస్తారు. మనిషి మేధాసంపత్తిలోని ప్రగతి కి ముఖ్య కారణమైన సైన్స్ అండ్ టెక్నాలజీకి గుర్తుగా యూరోప్ ,ఆసియాలతో సహా చాలా దేశాల్లో ఈ దినోత్సవం జరపబడుతుంది.
1957 అక్టోబర్ 4న స్పుత్నిక్- 1 అనే మానవ నిర్మిత ఉపగ్రహాన్ని ప్రయోగించింది . 1967 లో అక్టోబర్ 10న అవుటర్ స్పేస్ ఒప్పందంపై (చంద్రుడు ఇతర ఖగోళ రహస్యాలు అన్వేషించే నిమిత్తం) పలు దేశాలు సంతకం చేసాయి. అక్టోబర్ 4 నుండి 10వ తేదీల చారిత్రక సంఘటనకు గుర్తుగా , 1999 డిసెంబర్ 6న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఈ రెండు రోజుల మధ్య గల వారాన్ని అంటే అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారంగా ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే పెద్ద అంతరిక్ష వేడుక. 95 దేశాలు ఈ వేడుకను జరుపుకుంటాయి.
వరల్డ్ స్పేస్ వీక్ అసోసియేషన్ మరియు యునైటెడ్ నేషన్స్ సమన్వయంలో ఈ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుపబడతాయి. 2019లో , 96 దేశాలు ఎనిమిది వేల కార్యక్రమాల్ని చేపట్టాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లానిటేరియాల్లో పలు కార్యక్రమాలు చేపట్టాయి. ఐక్యరాజ్యసమితి మానవ సమాజాభ్యున్నతికి వివిధ కార్యకలాపాలు చేపట్టి కృషి చేస్తుంది . స్పేస్ వీక్ అసోసియేషన్ లాభాపేక్ష లేని సంస్థ .50 దేశాలకు పైగా జాతీయ సమన్వయకర్తల మద్దతు ఉంది. ప్రపంచ అంతరిక్ష ‘ఆల్ వాలంటీర్స్ అఫ్ బోర్డు డైరెక్టర్స్ ‘దీనికి నాయకత్వం వహిస్తారు. అంతరిక్ష ప్రయోజనాలపై ప్రపంచ జన సమూహానికి అవగాహన కల్పించడం,విద్య, అభివృద్ధి శాస్త్ర సాంకేతికాంశాలపై ఆసక్తి కలిగించడం ,అంతరిక్ష విస్తరణ అంటే వివిధ ప్రయోగాలు చేకూర్చడం ద్వారా పలు దేశాల మధ్య సహాయ సహకారాల కృషి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం.
ప్రతి సంవత్సరం వరల్డ్ స్పేస్ వీక్ కోసం ఒక థీమ్ ను డైరెక్టర్లు బోర్డు ఏర్పాటు చేసి నిర్వహిస్తుంది. 2019 థీమ్ : ద మూన్: గేట్ వే టు ద స్టార్ట్స్ అపోలో 11 ల్యాండింగ్
యొక్క 50వ వార్షికోత్సవం, ఇంకా చంద్రునిపై టెలిస్కోప్ ద్వారా అన్వేషణ, పరిశోధన .(అంటే ప్రణాళికలపై దృష్టి కేంద్రీకరించడం)
2022 థీం : అంతరిక్షం మరియు స్థిరత్వం.
2021 థీం :ఉమెన్ ఇన్ స్పేస్
2020 థీం :సాటిలైట్స్ ఇంప్రూవ్ లైఫ్.
ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం: అంతరిక్షంపై జన సామాన్యానికి సరైన అవగాహన కల్పించడం
ఈ టీం లో పాల్గొనే వారి కార్యక్రమాలు, కంటెంట్స్ ఐక్యరాజ్యసమితి చక్కటి దిశా నిర్దేశం చేస్తూ వారిని ప్రోత్సహిస్తుంది.
రాధికాసూరి