చుట్టూ పంచభూతాలు ఆవరించి ఉంటాయి. రకరకాల మనుషుల లాగా. ఏది నచ్చినా నచ్చకపోయినా,ఎవరు నచ్చినా నచ్చకున్నా చూస్తూ ,చూడనట్టు జీవితం వెళ్ళదీస్తుంటారు మనుషులు. తప్పదు. ఎందుకంటే అన్నింటిని సరి చేయలేరు.అందరినీ మార్చలేరు. కానీ వీటన్నింటిని మించిన మానవ ప్రకృతి అనేది కూడా ఉంటుంది. మనిషులు తనలోని నైజాన్ని,తనలోని భేషజాన్ని విడిచి మనలేక , తప్పదనుకుంటూనే నలుగురి తో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంటారు.
ఇది ఈనాటి మాట కాదు ఆదిమానవ చరిత్ర నుంచి చూస్తున్నాం. ఇండ్లు కట్టుకోవడం తెలియని ఆ కాలం లో కొండలు గుహలు చెట్లు మనిషి జీవనానికి నివాస వసతులుగా ఉండేవి. సాధారణంగా తనకు కనిపించిన, తనకు నచ్చిన, తనకు అలవాటున్న పదార్థాలు తినడం మనిషికి ఇష్టం.
మనం చెప్పుకుంటున్న ఆదిమానవుల కాలంలో ఉడికించి కాల్చి వంట వండి తినడం తెలియక అలాగే పచ్చిగా తినడం అలవాటున్న ఆ కాలంలో మనుషులు చాలా తక్కువ సంఖ్యలో ఉండే వాళ్ళు.జన సాంద్రత లేదు .ప్రకృతి సంపద తో తులతూగే అడవులు విరివిగా ఉన్న కాలమది. క్రమంగా కాల్చి ఉడికించి తినడం నేర్చుకున్న తర్వాత, గుహల నుండి గృహ నిర్మాణాలకు మారిన తర్వాత వ్యవసాయం చేయడం నేర్చుకున్న తర్వాత, నది పరివాహకం లో నగరాలు నిర్మించుకున్న తర్వాత, ఇక జనమే జనం. ప్రజలు ఎక్కువ అయ్యేసరికి, కూటములు పెరిగేసరికి, నాయకత్వ లక్షణాలున్న వాళ్ళు నాయకులయ్యే సరికి, పండించిన ధాన్యాన్ని పరివారాన్ని రక్షించుకోవడానికి రాజులు రాణులు సిద్ధమయ్యారు.రాజ్యాలు నిర్మించుకోవడం, కోటలు కట్టుకోవడం పరిపాలన నేర్చుకోవడం నుంచి ఒకటేమిటి మనిషి అలా ఎదుగుతూ ఎదుగుతూ… జనారణ్యంలో విహరించడానికి వీలులేని పరిస్థితిలోకి వచ్చినటువంటి స్థితి ఇప్పుడు వచ్చి పడడం చూస్తున్నాం.
అక్టోబర్ 1 ప్రపంచ శాఖాహార దినోత్సవం గా ప్రకటించుకునే స్థితికి వచ్చే వరకు ఎన్ని మార్పులు !ఎన్నెన్ని మార్పులు !! ఓ సారి ఆలోచిద్దాం. ఓసారి అవలోకిద్దాం.
1970 లలో ఉత్తర అమెరికా శాకాహార సొసైటీ ప్రపంచ శాఖాహార దినోత్సవాన్ని నిర్వహించింది. కారణాలు,అవసరాలు, పరిస్థితులు,కండిషన్స్, రిగ్రెట్స్, ఫైటింగ్స్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి కేవలం ఈ రోజు ప్రత్యేకతను చర్చించుకుందాం. ఉత్తర అమెరికా శాకాహార సొసైటీ నిర్ణయాన్ని అమెరికా వాళ్ళు కూడా ఒప్పుకొని 1977లో మొట్టమొదటిసారిగా శాఖ హార దినోత్సవాన్ని వీళ్ళు కూడా మొదలుపెట్టుకున్నారు.ఇక అప్పుడు 1978 లో ప్రపంచ వ్యాప్తంగా అందరూ నిర్వహిస్తున్నారు. శాఖాహారం అంటే వెజిటేరియన్ అనీ, మాంసాహారం అంటే నాన్ వెజిటేరియన్ అనీ అంటారు.
అయితే, తిండి అనేది ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది.పప్పు దినుసులు, వరి బియ్యం, గోధుమ , జొన్నలు,తృణ ధాన్యాలు వంటివీ,ఆకుకూరలు,కూరగాయలు, పండ్లు వంటివి శాఖాహారం కిందికి వస్తాయి. వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉంది వీళ్ళ సర్వేలో ప్రపంచ దేశాల్లో శాఖాహారులు ఉన్నారు అందులో భారత దేశంలో శాఖాహారులు కాస్త అత్యధికంగా ఉన్నారు అని నిర్ణయించింది. అమెరికా ఆస్ట్రేలియా ఇటలీ జర్మనీ లండన్ బ్రెజిల్ తైవాన్ ఇజ్రాయిల్ ఇలా అన్ని దేశాల్లోనూ శాఖాహారులు ఉన్నారు. విమానాలలో శాఖాహార భోజనాన్ని అందిస్తూ ఉంటారు. ఎన్నో పెద్ద పెద్ద పట్టణాలలో శాకాహార కేసులు శాఖాహార హోటల్స్ ప్రత్యేకంగా ఉంటాయి.
ప్రామాణికమైన ఆహార పద్ధతులతో పరిశుభ్రమైన పరిసరాలలో పోషకాహార విలువలతో కూడిన తాజా కూరగాయల పండ్ల తో కూడిన శాఖాహారం మాత్రమే ఆరోగ్యకరమైనది.
ప్రపంచ వాణిజ్యంలో వ్యవసాయ వాణిజ్యం అనేది చాలా కీలకమైపోయింది. కారణం నిత్య అవసరాల ధరలు అధికం కావడం. ఐక్యరాజ్యసమితి కి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ ఏ ఓ నిర్ణయాలు ప్రకారం మౌనిక ప్రభుత్వాలు ఆచరణలో పెట్టాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత గమనించి ఆహార భద్రత పెంపొందించే ఉద్దేశంతో ధరల నియంత్రణ లో భాగంగా ఆహార కార్యక్రమం అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. కనిష్ట గనిష్ట స్థాయిలలో ఆహార ధరలు అంతర్జాతీయ ఆహార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది.
ఇక్కడ సమస్య అంతా ఆహార ద్రవ్యోల్బణం తలెత్తడానికి కారణాలను వెతకడం కాదు ఇది ఒక పెద్ద సబ్జెక్టు.
ప్రపంచ దేశాలలో చాలా దేశాలకి భారతదేశం నుంచి బియ్యం వంటి వి ఎగుమతి చేసే విషయమూ చర్చించడం లేదు. ప్రపంచ వాణిజ్య వ్యవస్థ ఆంక్షలు నిర్ణయాలు వాస్తవాలు వంటి విశ్వసనీయ విషయాల చర్చ కూడా కాదు.
ఇప్పుడు మధుమేహం అంటే షుగర్ ప్రాబ్లం ఎక్కువైన రోజులలో మనం ఉన్నాం. సమతుల్యమైన బ్లడ్ షుగర్ బ్యాలెన్స్‌ల కొరకు చాలా ఆలోచించి ఆలోచించి తినవలసి వస్తున్న రోజులలో ఉన్నాం. ప్రతి భోజనంలోనూ ఒక అత్యధిక ప్రోటీన్ మూలం ఉన్న ఆహారాన్ని తినాలి అని ఇది సానుకూల ప్రభావం చూపుతుంది అని శాఖాహారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి రోజులు. ఈ ఆరోగ్య ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఫైబర్ చాలా ఎక్కువ ఉన్న ఆహారాన్ని తినాలని ఇది శాఖాహారంలో లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు. గింజలతో చేసిన వెన్న తినడము బీన్స్ , బ్లాక్ బీన్స్ ,అవకాడో,టోఫూ , సీజనల్ సలాడ్స్,మొలకలు వచ్చిన ధాన్యాలు,ముదురు ఆకు కూరలు, చర్మంతో కూడిన పండ్లు బెర్రీ ఆపిల్ వంటివి, డ్రై ఫ్రూట్స్,పెరుగు వంటి ఫైబర్ ఫుడ్ తినడము మంచిది అని చెప్తున్నారు. ఆలివ్ నూనె, అవకాడో నూనె, గానుగ లో పట్టించిన నువ్వల నూనె, కొబ్బరి నూనె వంటివి ఉపయోగించాలని అంటున్నారు. కానీ ఏవైనా లిమిట్ లో తినాలి, శుభ్రమైన వి తినాలి, పరిశుభ్రమైన వాతావరణంలో తినాలి. వేళను పాటిస్తూ ఆకలి వేసినప్పుడే తినాలి. కాస్త పచ్చితనం పోగొట్టు తినడం మంచిది ఎన్నో ప్రికాషన్స్ చెప్తూనే ఉన్నారు హెల్త్ బెనిఫిట్స్ కోసం.
ఇవన్నీ అందరికీ తెలుసు అయినా అశ్రద్ధ తొందరపాటు ఆత్రుత వంటి కారణాలతోనే ఆరోగ్యం పై దృష్టి సారించరు.
అలా జాగ్రత్తగా ఉంటే తప్పకుండా అందరికీ మంచి ఆరోగ్యం ఉంటుంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే శరీర ప్రకృతి కి అనుగుణంగా నడుచుకోవడం అవసరం. అసలు ప్రకృతిలోని మనుషులం కదా!
ఎక్కడైనా “అతి సర్వత్ర వర్జయేత్” అన్నారు. శాకాహార భోజనం గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. మరో రోజు మాంసాహార భోజనం గురించి మాట్లాడుకుందాం.
కానీ ఏ భోజనం తింటున్నా, సేంద్రియ ఆహారం అంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడమే మంచిది.. అంటే కెమికల్స్ , పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉపయోగించకుండా పండించే ధాన్యం కూరగాయలు పండ్లు పైన చెప్పుకున్న అన్ని ఆహార పదార్థాలు స్వచ్ఛమైనవి తీసుకోవడంతో ఆరోగ్యం బాగుంటుంది. క్రిమిసంహారకాలు, ఎరువులు వాటి ఉపయోగాలు ఉపయోగాలు గురించి చర్చ కాదు ఇది. ఎన్నో శాస్త్రీయ పరిశోధనల వలన ప్రకృతి సిద్ధమైన వ్యవసాయంతో పండించిన వి ఆహారంలో తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. ఈ కంటామినేటెడ్ వరల్డ్ లో ఇది ఎంతవరకు సాధ్యం? తరగని ఈ ప్రశ్న ప్రకృతి మనిషి మధ్య ఎడతెగని వారధి!!