మన మహిళామణులు

శ్రీమతి గిరిజా రాణి చంద్రమౌళి

కొంతమంది ఎంతో నిశబ్దంగా తమ పని తాము చేసుకు పోతుంటారు.తమగూర్చి తక్కువ చెప్తూ సమాజసేవలో పాలు పంచుకుంటారు.అలాంటి నిరాడంబర మహిళా మణి శ్రీమతి గిరిజా రాణి చంద్రమౌళి.

గిరిజా రాణి చంద్రమౌళి

సనాతన ధర్మం, సంప్రదాయ పద్ధతులు ఆచరిస్తూ నిష్కల్మషమైన హృదయంతో నిష్పక్షపాతంగా సాటి మనిషి కష్టాలలో తనకు చేతనైన సహాయం చేయడం ఆమె నైజం.B.A డిగ్రీ చదివిన తరువాత రేడియో, కమ్యూనికేషన్ వంటి సాంకేతిక శిక్షణ పొంది
హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగం సంపాదించి 33 సంవత్సరాలు తన సేవలు అందించారు . లలిత కళల పట్ల ఆసక్తితో తను పనిచేస్తున్న సంస్థ నిర్వ హించే సంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు . వంటల పట్ల అభిరుచి ఉన్నందున కొత్త వంటలు చేయడానికి ఆసక్తి ఎక్కువ.ప్రస్తుతం విశ్రాంత జీవితంలో అలుపెరుగని శ్రమజీవి శ్రీమతి గిరిజా రాణి. ప్రభుత్వపరంగా ఏ సహాయం అందని చురుకైన విద్యార్థులకు
ఫీజులు కడుతూ వారి చదువులు అర్ధాంతరంగా ఆగి పోకూడదని ఎంతో తపన పడతారు ఆమె.
ఆర్భాటాలకు ఆమడదూరంలో ఉంటారామె. అనారోగ్యం తో ఉండి ,సరైన చికిత్స అందక బాధ పడేవారికి చేతనైన సహాయం చేయడం, పెళ్ళిళ్ళు కాక  మానసికంగా బాధ పడేవారికి తగిన సంబంధాలను ఉచితంగా చూసి పెడ్డడం ఆమె హాబీ.
తన సేవలందుకున్న వారి నుండి ఎటువంటి కానుకలు,బహుమతులు తీసుకోవడం ఆమె ఇష్ట పడరు. ఆ డబ్బుతో మరొకరికి సహాయం చేయమని వారికి సూచిస్తారు ఆమె.
పూజలు, నోములు చేసుకొనే మహిళలకు వారి దీక్ష విజయవంతం కావడానికి దోహద పడతారు . ఇటువంటి సున్నితమైన అంశాల ఉన్పైన కూడా ఎంతో శ్రద్ధ వహించి అందరూ తన వారే అనే భావనతో ఉంటారామె.
గత 40 ఏళ్లుగా ఇటువంటి సేవలందిస్తున్న ఆమె , హు సామాన్య జీవితం గడుపుతున్న ఉత్తమ ఇల్లాలుగా బంధు మిత్రుల మన్నలను పొందుతున్నారు.
కొస మెరుపు .. ఆమె సేవలకు గుర్తింపుగా అఖిల భారత బ్రాహ్మణ సమితి వారు ప్రదానం చేసిన “బ్రాహ్మణ రత్న ” బిరుదును ఏనాడూ ఎక్కడా పేర్కొన లేదు.
భర్త రామకృష్ణ చంద్రమౌళి గారు కవి సమాజసేవకులు.ఫోన్ 9666656687 ఆదర్శజంటగా అందరిమన్ననలు పొందుతున్న ధన్యజీవులు🌷

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రవల్లిక

కవితా వాహిని..