కష్టాలు… ప్లస్ ..కన్నీళ్లే నాఆడదంటే,,,?
తెలుగు సీరియళ్ల ధారావాహిక ఆడదంటే..??
చిటికెడు… పసుపు ..కుంకుమ.. పసుపు తాడే కాదు ఆడదంటే
ఆడదంటే బాధ్యత….. బానిస.. అలుసు.. సింగారం …శృంగారం.. ఈనిర్వచనాలకి..కాలం చెల్లు.. ఈ భాష్యాల కి చెదలు పట్టా. .. ఇవ్వనికాగితాలపై ఒలికిన ఇంకు. బుడ్డిమరకలు మరకలు. . నిజంగాఇవన్నీ ఆడ దాని జీవితానికి పట్టిన గోమారి పురుగులు.
ఇప్పుడు…….!!!!!
ఆడవాళ్ళ గొంతుకు
మగవాళ్ళ డబ్బింగ్ చెప్పే రోజులు పోయాయి
తెరవెనుక మగవాళ్ల ప్రామ్ టింగ్ కు
ఇక కాలం చెల్లు..
అమ్మగా ఆధారపడాలని
చెల్లి గా చెప్పింది. వినాలని
ఆడదంటే అనగి ఉండాలని
శాసించేమగ మహారాజులు
రాజ్యాలు కోల్పోయిన బి కారులు అయ్యారు..
ఇకనుంచి మా జీవితాలకు
కథ ..మాటలు ..పాటలు ..స్క్రీన్ప్లే మేమే..
ఇక మాకు కొత్త “చలం” అక్కర్లేదు.
కొత్తగా సవరించిన చట్టాలు కావాలి.
ఇక మా జీవితాలకు. కర్తలం.. భర్తలం. విధాతలo.. మేమే
పెగులుతున్న మా గొంతుక
సరికొత్త. రాగం .తాళం .పల్లవి..