బోర్డర్లో సైనికుడిగా పని చేస్తున్న తన బావ ని పెళ్లి చేసుకున్న ధరణి జీవితం ఆలా ప్రశాంతంగా సాగిపోతుంది.ఇలా ఇంకా ఎన్నాళ్ళు ఈ ఎడబాటు ఒకరికి ఒకరం దూరంగా బ్రతకడం నేను ఉండలేకపోతున్నా అని ధరణి అనడంతో తన బావ కూడా అవును నేను కూడా ఉండలేకపోతున్నా కానీ డ్యూటీ కి కట్టుబడి ఉండాల్సి వస్తుంది,నువ్వే ఏదయినా ఒకటి చేసి మన లైఫ్ సెట్ చేయాలి అంటాడు.నేనేం చేయగలను బావ అని ధరణి అనడం తో
“నువ్వు బాగా చదువుకున్నావు మంచి తెలివితేటలు ఉన్నాయి.నువ్వు కొద్దిగా కస్టపడి పై చదువు పూర్తీ చేసి విదేశాలకు వెళ్లగలిగితే మన జీవితం ఒక దారిన పడ్తుంది,నేను కూడా ఈ జాబ్ వదిలేసి నీతో కలిసి ఉండే అదృష్టం వస్తుంది” అని అంటాడు.
అపుడు ధరణి అంతకన్నా నాకు కావాల్సి ఏముంది బావ నేను ఎంత కష్టపడడానికి ఐన సిద్దమే ఎప్పటికైనా మనం కలిసి ఉండాలి మిమ్మల్ని ఒక రాజు లాగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా చూసుకోవాలి అనేది నా కోరిక అని చెప్తుంది.ఇంతలో ధరణి చదువు పూర్తీ అయే సమయం దగ్గర పడడంతో ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లే ప్రయత్నం లో ఉంటారు.ఈ క్రమంలో ఒక ఇన్స్టిట్యూట్ లో వెళ్లి కలవగా “మీ ఆవిడకి విదేశాల్లో మంచి జాబ్ కచ్చితంగా వస్తుంది” అని చెప్పడం తో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు.వెంటనే జాబ్ కి అప్లికేషన్ ఇచ్చి ఇంటికి వచ్చి ఎంతో ఆనందంగా ఉంటారు.
“ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ “అన్నట్టుగా ఇంతలో అర్ధరాత్రి సమయం లో ధరణికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది.తన బావ కి చెప్పడం తో ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరకి వెళ్లారు.డాక్టర్స్ అన్ని చెకప్ చేసి మీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు
“నీ భార్య ఒక దీర్ఘకాలిక సమస్య తో బాధపడుతుంది విచిత్రం ఏమిటి అంటే ఆ సమస్య కి మందు కూడా లేదు” అని చెప్పడంతో ఆ సైనికుడి ఆవేదనకు అంతు లేదు శోకసంద్రం లో మునిగిపోతాడు.ఎక్కడికి తీస్కెళ్లమన్నా తీసుకెళ్తా ఎంత ఖర్చు ఐన పర్వా లేదు ఆమెకి ఎలాగైనా నయం చేయండి అని డాక్టర్ ని వేడుకుంటాడు.డాక్టర్ మేము చేయగలిగింది ఏమి లేదు నొప్పి వచ్చినపుడు ఓర్చుకోడం తప్ప ఆ సమస్యకి మందు లేదు,తనని ఒత్తిడి కి లోను అవకుండా జాగ్రత్తగా చూస్కుంటే తన సమస్యని పెంచకుండా చూసుకోవచ్చు అని చెప్తాడు.ఈ విషయం విన్న ఆ దంపతులు ఇద్దరు ఒకేసారి కృంగిపోతారు.
ఇపుడు ఎలా ఎం చేద్దాం అని ఆలోచిస్తున్న ధరణి దగ్గరకి వచ్చి తన బావ ఇలా అంటాడు
“విదేశాలకి వెళ్లడం అవన్నీ ఏం వద్దు ఇపుడు నాకు నీ ఆరోగ్యం ముఖ్యం నిన్ను సంతోషంగా చూసుకోవడం నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం”
ఇంకా కొన్ని రోజులు ఇలాగే కష్టపడడం అంటాడు.అపుడు ధరణి విదేశాలకి వెళ్లకపోతే ఏంటి బావ నేను ఇపుడు చేసే ఉద్యోగం తో కూడా మనం బ్రతకొచ్చు మీరు వచ్చేసి నాతోనే ఉండండి కనీసం నేను ఉన్నన్ని రోజులు ఐన కలిసి ఉందాం అని తన బావ ని కోరుకుంటుంది.అపుడు తన బావ దగ్గరికి తీస్కొని నువ్వేం బాధపడకు నువ్వు అన్నట్లే ఆలోచిద్దాం కానీ మనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలి,నేనే ఎదో ఒకటి చేస్తా అని చెప్పి తన సెలవులు పూర్తీ అవడంతో తిరిగి బార్డర్ కి వెళ్ళిపోతాడు.
ఇన్నాళ్లు ఎడబాటు లో ఉన్న ఆ భార్య భర్తలు ఒకటి అవుతారా !ధరణి ఆరోగ్యం కుదుటపడి తన కోరిక ప్రకారం తన బావ ఉద్యోగం వదిలేసి వచ్చి ఒకే దగ్గర కలిసి ఉంటారా!
కనీసం “చివరి క్షణం లో ఐన తన భర్తతో కలిసి జీవించాలి అనే ఆ శ్రీమతి కోరిక తీరేనా!…”
ఇది ఈ ఒక్క భార్య కథ కాదు దేశ రక్షణ కోసం సరిహద్దులో పని చేసే ప్రతి సైకుడి భార్య ఆవేదన.తన భార్యా బిడ్డలని వదిలి దేశం కోసం, కాపు కాస్తున్న ప్రతి సైనికుడికి నా జోహార్లు.
( ఈ పెద్ద కథకి ముగింపు వచ్చే వారం చూద్దాం)