లేచింది మొదలు ఉరుకులు పరుగులు. పూర్తి రెస్ట్ లెస్ గా ఉంటుంది అని గునుస్తున్న తీరు చాలా మంది లో కనిపిస్తుంది. తీరిక లేకపోవడం దేనివల్లనోకానీ, ఓ సారి హృదయపూర్వకంగా కొన్ని విషయాలు స్పృశించి అన్వేషించి అవలోకించి అలా అలా మనలోకి మనం , మనదికాని తనం, మనదే అయ్యే ఆలోకనం లో కి ఇలా ఓసారి….!!
అదేంటో గాని చాలా మంది కి వాళ్ళ వాళ్ళ బాల్యం చాలా చాలా మరపురాని జ్ఞాపకం గా వెంటాడుతూ ఉంటుంది. కొందరికి తియ్యగా కొందరికి చేదుగా!తీపి జ్ఞాపకాలు వెంటతెచ్చుకొని గర్వితులం కావద్దు. చేదు జ్ఞాపకాలు వెంటతెచ్చుకొని నిరాశపరులం కావద్దు. ఇది అదీ ఏదీ శాశ్వతం కాదు.
అంతులేని భోగభాగ్యాల మధ్య పుట్టిన వాళ్ళు జీవితకాలం అవే సుఖసంతోషాలతో ఉండరు. అనంతమైన కష్టాల్లో బాల్యమంతా గడిపిన వాళ్ళు ఎల్లకాలం అవే ఈతిబాధలతో ఉండరు. కష్టాలను అధిగమించి ముందుకు వచ్చిన వాళ్ళు నలుగురికి మార్గదర్శకులవుతారు. వీళ్ళు ఒక్కోసారి అమితాశ్చర్యానికి గురి చేస్తారు.అందుకే ఎప్పటికప్పుడు స్టోరేజ్ స్పేస్ క్లియర్ చేసుకోవాలి . వెనుకటి బాధలను గానీ వెనుకటి సంతోషాలను గానీ తుడిచేసుకోవాలి. ఎందుకంటే వాటి తాలూకు అనుభవాలు మనసు గోడలపై ఫ్రేములుగా ఉండిపయేవే! ఇక హృదయ కవాటాలలో బరువెందుకులే అనే కదా అనిపిస్తుంది.
ఈ ఆత్మావలోకనం ఉన్నదే ఇది మహా మహా ఓపికస్తులకూ అవసరమే. అటువంటి ది .
ఎవ్వరితో నాకేంటనుకోలేము. ఎందుకంటే మనం ఎందరిమీదనో ఆధారపడి జీవిస్తున్నాం. ప్రత్యక్షంగా నో, నరప్రత్యక్షంగా నో!!మనకోసం పనులు చేసే ఎందరో ఉద్యోగులు, పనులు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ను మనమెలా చూస్తున్నాము, మనమెలా అనుకుంటున్నాము అనేదాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ తోడేసెయ్యాలి క్లియర్ చేసుకోవాలి.
ఉదాహరణకు బ్యాంకు ఉద్యోగులు ఉన్నారనుకోండి. మనవైన ఆర్థిక లావాదేవీలతో ఆ ఉద్యోగులకు అవసరం లేదు. కానీ వాళ్ళ సేవలను మనం వినియోగించుకుంటాం. ఇలాగే ఉపాధ్యాయులు, వైద్యులు,వైద్య సేవా నిపుణులు, రవాణా ఉద్యోగులు, పారిశుధ్య ఉద్యోగులు ప్రతి ఒక్కరూ మనకందరికీ సేవలు చేస్తున్నారు. పనులు సేవలు ఉత్తినే చేస్తున్నారా అనే వితండవాదం చేయకుండా మనదైన కర్తవ్య నిర్వహణలో భాగంగా కనీసం వాళ్ళను గుర్తు చేసుకోవడం, గౌరవం గా చూడడం వంటివి మనం చూపిస్తే తర్వాతి తరాలవాళ్ళకు వీటి విలువ తెలుస్తుంది.
దీన్నే ఆత్మావలోకనం అంటాను. What is there in your mind ? అని ప్రశ్నించే ముందు what is there in our mind ? మన చుట్టూ ఉన్న సమాజం మనలో దాగిన ఆలోచనలనూ ప్రశ్నించుకోవాలి.
” తప్పులెరుగని వారు తమ తప్పులెరుగరు” ఆహా ఎంత గొప్ప మాట! ఇది కేవలం తప్పులెంచేవాళ్ళగురించే కాదు. ఒప్పు లను గుర్తింపు తేని వాళ్ళ గురించి కూడా!
అందుకే తప్పనిసరైన ఓ ‘ లోచూపు‘ ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ ఆత్మావలోకనం ఆత్మ విమర్శల లేకపోవడం ఆత్మాభిమానధనులకు చెంప పెట్టు!