రాధ మాధవం

గుండె గూటిలో
తుషార హేమంతాలలా
వసంత కేళీ విలాసం లా
మంగళ నీరాజనాలు
మొత్తం నీ సుతిమెత్తని మనోవేదకయ్యె
హే కృష్ణా
రాధామాధవ రంజిలు
కీర్తనల మాధుర్యానివై

సంగీత సాహిత్య సమ్మేళనం లా
ప్రేమానురాగాలు
సరస వినోదినీ సాంగత్యం
మొత్తం
వర్ణమయ శోభితమై.

చిత్రకారిణి – అనూషా మాధవి జోస్యుల

అందమంటే అక్షరాలను
పేర్చి కూర్చిన కవిత్వ భావలయల తాయిలంలా

ఘనరాగ పంచరత్నాలు
మురళీ నాద తరంగాలలో పలికించి
ఆవృతి రాగ కృతుల గతి సవరించి
వీనులవిందు చేసి
నీదైన పారమార్థిక భావజగత్తు విహరణ చేసి
ప్రౌఢ ప్రయోగాలో
సుతిమెత్తని నీ హృదయం
ఈ కృతిని అను శృతి ని
ఏకోన్ముఖలను చేయదా

ఖండగతులు
ఈ అర్థ నిమీలిత నేత్రాలు
ఈ సుందర వదనానికి
నీలో సగానికి
ఏమందువయా
ఎందెందు వెదక
ఆనంద తాండవం
ఈ మురళి
ఈ రాధ మాధవం
ఓం శాంతి బృంద గానం

 

చిత్ర కవిత- డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒకే తాను ముక్కలు

మౌనలోకం