హేమ పేరు కి తగ్గట్టే అందాల బొమ్మ.వినయం విధేయతలతో ఆదరంగా పలకరించే పూలరెమ్మ.” బాబు పుట్టి నాలుగు నెలలైంది ఆంటీ! అమెరికా లో ఉన్నాను” అని ఫోన్ చేస్తే నామనసు పొంగిపోయింది.సుధీరారాణి వేంకటేశ్వర రావు దంపతులకుమార్తె.జె.ఎన్.టి.యు.లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఈమె కూచిపూడి నృత్యం లో నిష్ణాతులు.చదువు డాన్స్ అనే రెండు పడవలపై కాలుపెట్టి రెండు రంగాలలో ముందంజవేసి అందరి మన్ననలు పొందారు పొందుతున్నారు.ఎం.టెక్.కూచిపూడిలో డిప్లొమా చేసిన సవ్యసాచి.
ఆమె వంశంలో ఎవరికి డాన్స్ రాదు.అది దైవదత్తం.తండ్రి ఉద్యోగం ట్రాన్ఫర్స్ మూలంగా వివిధ రాష్ట్రాలలో ఉన్నారు.5వ ఏటనుంచే దాండియా కథక్ భరతనాట్యం నేర్చుకున్నారు.కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడిన తర్వాత తొలిసారిగా కూచిపూడి నృత్యంలో శిక్షణ ను శ్రీ చింతా ఆదినారాయణ డా.నిర్మలా విశ్వేశ్వర రావు డా.హిమబిందు వంగర వద్ద నేర్చుకున్నారు.
డా.వనజా ఉదయ్ తెలుగు యూనివర్సిటీ హెచ్.ఓ.డి.డాన్స్ శ్రీమతి పద్మా కల్యాణ్ దగ్గర మెరుగులు దిద్దుకున్నారు.s.v.s.కళానికేతన్ అనే సంస్థ ను నెలకొల్పి హైదరాబాద్ లో రెండు బ్రాంచీలలో 450మందికిపైగా శిక్షణ ఇచ్చారు.కొందరు డాన్స్ సర్టిఫికెట్ కోర్సు పాసైనారు.
హైమకి వచ్చిన అవార్డులు..శ్రీ రోశయ్య గారు ఆనాటి గవర్నర్ గారి ద్వారా నాట్యకళారత్న అవార్డు పొందారు.ఉగాదిపురస్కారం నాట్యమయూరి బెస్ట్ టీచర్..ఇలా ఎన్నో ఎన్నెన్నో!కోటి దీపోత్సవం శిల్ప కళా వేదిక ఆలయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రదర్శనల్లో పిల్లలచేత ఎన్నో ప్రోగ్రాంలు ఇప్పించారు.నృత్యంలో ఆనరరీడాక్టరేట్ పొందారు.
డాన్స్ థెరపీలో రిసెర్చ్ చేస్తున్నారు.యు.ఎస్.ఎ.లో ఉంటూ జాబ్ చేస్తూ ఆచిన్నారికి తల్లిగా ఇంటాబైట బిజీ బిజీగా ఉండే హైమ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. ఇంకా ఈమె ఎన్నో పురస్కారాలు పొంది భారతదేశ కీర్తిపతాకం ఎగరేయాలని తరుణి తరుఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను.ఈమె ఫోన్ +1(248)787-5160