కొత్తగా ఆలోచించాలి. అప్పుడే జీవితం మాధుర్య భరితం అవుతుంది. ఈ విషయాన్ని కవయిత్రి ,రచయిత్రి ,తెలుగు ఉపాధ్యాయురాలు కామేశ్వరి ఓగిరాల గారు తెలుగు వ్యాకరణం లోని అక్షర మాల నుండి అచ్చులు హల్లులు , వర్గాక్షరాలు, సంధులు సమాసాలు అలంకారాలు ఛందస్సు వంటివి నిత్య జీవితానికి అన్వయం చేస్తూ చక్కగా క్లుప్తంగా రాస్తున్నారు. సీరియల్ గా వచ్చే ఈ విశేషాలను చదివి ఆనందించండి.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు
మిత్రులారా! గత 5వారాలుగా మనుష్యులలో గల వివిధ రకాల స్వభావాల కు వ్యాకరనానికి గల పోలికలు గురించి సంబంధం గురించి పరిశీ లిస్తున్నాం. వ్యాకరణం అంటే బార్ గా ఫీలవకుండ ఈ విధంగా మనుష్య స్వభావాల తో అన్వయం చేసుకుంటూ అధ్యయనం చేసుకుంటే సులభంగా అర్దం చేసుకోగలరు అన్న నా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్న పాఠక లోకానికి కృత జన త లు తెలుపు కుంటున్నాను.
అలాగే ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ నన్ను పాఠక లోకానికి పరిచయం చేసిన నీహా రిని మేడం గారికి కృతజ్ఞత లు తెలుపుకుంటున్నాను.
లోకో భిన్న రుచి అన్నట్లు మన జీవిత ప్రయాణంలో ఎంతో మంది ఎన్నో సందర్భాలలో తారస పడుతూ ఉంటారు. అందరి స్వభావాలను అంచనా వేసుకుంటూ వారు వేసే ఎత్తులను చిత్తు చేస్తూ మనం ముందడుగు వేయాలి.
ఇంతవరకు మనం ఎవరెవరు ఎన్ని రకాలుగా అణచి వేస్తున్నా రో చూసాము. కానీ అందరూ ఒకే లాగా ఉండరు కదా! మనకు సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉండే మిత్రులు కూడా ఉంటారు.
చూడండి ఇద్దరి మధ్య సంధి జరిగే అవకాశం లేనప్పడు కూడా కొందరు వారి వాక్చాతుర్యంతో కలుపుతూ ఉంటారు.
యడాగమ సంధి అమ్మ+ఇచ్చెను. అమ్మ యిచ్చెను
రుగాగమ సంధి బాలింత+అలు బాలింతరాలు.
టుగా గమ సంధి పల్లె+ఊరు పల్లెటూరు
సంధి ప్రక్రియలో ఆదేశాల న్ని శత్రువులు
ఆ గమాలన్ని మిత్రులు.
బహుళ అంటే ఏ ఎండకు ఆ గొడుగు అన్నమాట.
ఈ వారం తో సంధి ప్రక్రియ ను ముగిస్తున్నాను.
వచ్చే వారం మరో అంశం తో మీ ముందుంటాను.