మల్లినాథ సూరి కళాపీఠం ;

వ్యాకరణ ప్రాముఖ్యత-  విన్నపం- లేఖ.

వ్యాకరణం కొరకరాని కొయ్య అని భావించడమే…చాలామంది పిల్లలు వ్యాకరణానికి దూరంగా ఉంటున్నారు.
అయినా నాకు మాత్రం వ్యాకరణం అంటే భక్తి భావం, గౌరవం ఎందుకంటే…. మా నాయన గారు చెప్పినట్టు…. షడంగాల్లో (  శిక్షా, వ్యాకరణం, చందస్సు, నిరుక్తం, జ్యోతిషం)  వ్యాకరణంశిరః స్థానంలో ఉందని చెప్పడమే…
వ్యాకరణం ద్వారానే భాషలోని శబ్దాలు వ్యాకరించ బడతాయి కాబట్టి,  వ్యాకరించడము అంటే  అంటే
పకృతి  ప్రత్యయ విభాగం చేసి,  శబ్దాలకు ఉత్పత్తులను  చూపించడం…. అలా వివరిస్తే నే భావం సరిగ్గా మనసు పట్టుకుంటుంది.

    వేల వేల శబ్దాల స్వరూప స్వభావాలను తెలుసుకోవడానికి, పదాలకున్న అర్థాలను నిర్ణయించడానికి ప్రత్యయ విభాగాల ద్వారా అర్థ సందేహాలను తీర్చుకోవచ్చును. ఇలా వ్యాకరణం ఎంతో ఉపయోగపడుతుంది.
వ్యాకరణం లేకుండా భాషను నేర్చుకోవడం వృధా అవుతుంది. వ్యాకరణం బాగా వచ్చిన వాళ్ళు తప్పులు లేకుండా భాషను ఉపయోగించగలరు. అలా ఎప్పుడైతే స్పష్టంగామాట్లాడగలరో , వారు గౌరవించబడ్తారు.
భాషలోని పదాలను మన పూర్వీకులు ఎలా వాడారో  తెలియాలంటే…. వ్యాకరణం వచ్చి తీరాలి. ఎందుకూ  అంటే ఒక పదం ఒక కాలంలో ఒక అర్థం…
కొంతకాలం తరువాత ఆ అర్థం మరొక అర్థం గా రూపుదిద్దుకుంటుంది… అటువంటప్పుడు వ్యాకరణం  తెలిస్తేనే … ఏ అర్థంలో వాడారు అని తెలుస్తుంది.
భాషాధ్యయనం చేయాలంటే… వ్యాకరణం అధ్యయనం చేయాల్సిందే… అలా చేసినప్పుడు భాష పరిజ్ఞానం ఎంతగానో  పెరుగుతుంది. తెలిసి ఉంటే మంచి పదాలేవో… చెడు పదాలేవో తెలుస్తుంది.. అంతేకాదు వాక్పటుత్వం కూడా పెరుగుతుంది.

భాష లక్ష్యం అయితే… వ్యాకరణం లక్షణం…
కవులుగా,  రచయిత(త్రు) లుగా  ఉన్నవారికి భాషాశాస్త్రం ఎంతో ముఖ్యమైనది. వ్యాకరణం బాగా వచ్చి ఉంటే అన్ని ప్రక్రియల్లోనూ( వచన కవితలు) సహా అందంగా రచనలు చేయవచ్చు. అందుకుగాను
గొప్ప ప్రయోజనం ఉన్న వ్యాకరణం ఈ పత్రిక  ద్వారా అందించాలని సంకల్పించడం అభినందించదగ్గ విషయము!
రంగరాజు పద్మజ

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అనగలరా ఎవరైనా…!!

ఎక్సలెన్స్ excellence