కొత్తగా ఆలోచించాలి. అప్పుడే జీవితం మాధుర్య భరితం అవుతుంది. ఈ విషయాన్ని కవయిత్రి ,రచయిత్రి ,తెలుగు ఉపాధ్యాయురాలు కామేశ్వరి ఓగిరాల గారు తెలుగు వ్యాకరణం లోని అక్షర మాల నుండి అచ్చులు హల్లులు , వర్గాక్షరాలు, సంధులు సమాసాలు అలంకారాలు ఛందస్సు వంటివి నిత్య జీవితానికి అన్వయం చేస్తూ చక్కగా క్లుప్తంగా రాస్తున్నారు. సీరియల్ గా వచ్చే ఈ విశేషాలను చదివి ఆనందించండి.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు
వ్యాకరణం నేర్చుకుంటే దోషాలు సవరించుకొని భాషను అవగాహన చేసుకో గలుగుతాం
జీవితంలో ఎంతో మంది మనకు ఎదురవుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం. ఎవరు ఎలాంటి వారో, ఎవరితో ఎలా మెలగాలో తెలుసుకుంటే జీవితం లో పైకి వస్తాం.
అసలు వ్యాకరణానికి జీవితానికి పోలికలు ఉన్నాయా? లేవా? సంబంధం ఏమిటి ఎలా అన్వయించుకోవాలి? ఇప్పుడు పరిశీలిద్దాం. క్రితం వారాలలో వర్గాక్షరాలలా మనుషుల లోనూ ఉంటారనీ,వ్ కార, అ కారాలను తోసేసి ‘ఆ‘గా వచ్చే సవర్ణ దీర్ఘసంధి వంటి విషయాల ఉదాహరణ లనూ తెలుసుకున్నాం
కదా ఇప్పుడు మరి కొన్ని తెలుసుకుందాం.
మిత్రులారా! ముందుగా నా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్న తరుణి పాఠకులకు ధన్య వాదాలు తెలుపు కుంటూ మరి కొన్ని అంశాలతో మీ ముందుకు వచ్చాను.
జీవితంలో ఒక్కొక్క సారి ఇద్దరు కలిసి ప్రయత్నం చేసారనుకొండి వేరే వాళ్ళు ఆ అవకాశాన్ని ఎగరేసుకు పోతారు. చూడండి ఎట్లాగో అనేది మనం గుణ సంధి, సూత్రాన్ని,ఉదాహరణ లు చూసాం. అలాగే,
కొంత మంది ఎదుటి వాళ్ల స్వభావం తెలుసు కోకుండా మన వాళ్ళే కదా అని చేర దీస్తారు. వాళ్ళు వచ్చిన తరువాత వీళ్ల నెత్తిన చేయి పెడతారు . ఎలాగో
త్రిక సంధి సూత్రాన్ని, ఉదాహరణ లు చూసాం.
కొంత మంది ఉంటారు గోడ మీది పిల్లి వాటం లా …
అయితే కావచ్చు కాక పోతే కాక పోవచ్చు అన్నట్లు ఉంటారని ఇత్వ సంధి నీ చూసాం.
ఇప్పుడు , ఈ 4వ వారంలో-
మిత్రులారా జీవితం లో మనకు ఎదురయ్యే మనుష్యులస్వభావాలకు వ్యాకరణానికి గల పోలికలు ఏమిటో సంబంధం ఏమిటో గత మూడు వారాల నుండి పరిశీలిస్తూ న్నాము. ఈ వారం మరి కొన్ని కొత్త అంశాలతో మీ ముందు కొచ్చాను
కొంత మంది ఏమి జరిగినా అంటే పరిస్థితులు ఎలాంటివి అయినా తమ అభి ప్రాయం మార్చు కొరు
స్థిరం గా ఉంటారు
ఉకార సంధి: ఉత్తునకు అచ్చు పరమగు నపుడు సంధి అగు
అంటే సంధి కచ్చితంగా జరుగుతుందని అర్దం.
మరి కొంత మంది ఇతరులకు సంధి కుదర్చ టాని కి సహాయం చేస్తారు. తాము ఎదురుకుండా లేక పోయినా తమ పేరు మాత్రం స్థిరంగా ఉండాలని కోరుకుంటారు.
ఉదా: అకా ర ఇకార ఉకార సందులలో సంధి జరిగి నప్పుడు పూర్వ పదాల లోని ఆ ఇ ఉ లోపిస్తయి కానీ వాటి పేరు నిలబడి పోతుంది.
కొంత మంది ఉంటారు వాళ్ళు వృద్దులు అయినప్పటికీ వాళ్ల మాటే చెల్లుబడి కావాలంటారు. ఏదైనా తమే నిలబడాలి అంటారు.
ఐ, ఔ లు వృద్దులు
వృద్ధి సంధి: అకారానికి ఏ పరమైనా ఐ పరమైనా ఐ వస్తుంది. ఓ పరమైనా ఔ పర మైనా ఔ వస్తుంది.
పరమ+ఔ ష ధం – పరమౌ ష ధం వంటి పదాలను ఉదహరించుకోవచ్చు.
ఇలా ప్రతి చోట ప్రతి సందర్భంలో మనకు తెలియకుండానే జీవితం లో వ్యాకరణం ముడిపడి ఉంది. మరికొన్ని అంశాలు వచ్చే వారం తెలుసుకుందాం.