మహిళామణులు

జైసంతోషీ మాత ఫ్యాన్సీషాప్ నడుపుతున్న శ్రీమతి శైలజ మహేష్ కుమార్

ఆమె భర్త కి చేదోడు వాదోడుగా ఉంటూ భరత నగర్ లో ఫాన్సీ షాపు నడుపుతున్నారు.ఇద్దరు కొడుకుల చదువు సంధ్యలు చూసుకుంటూ వంటపని ఇంటిపని చేసుకుంటూ కస్టమర్లకు కావాల్సిన వస్తువులు వాటి ధరలతో చెప్పి బిజినెస్ చేస్తున్న శైలజ మాతృభాష కన్నడం.ఆమె తన వివరాలు ఇలా చెప్పారు

శైలజ మహేష్ కుమార్

ఆమె అమ్మ నాన్నలు ఇద్దరూ కన్నడం వారు.బీదర్ దగ్గర నాగూర్ కి చెందిన వారు.తండ్రి కి చదువు లేదు.ఐనా బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి రకరకాల పనులు చేస్తూ ఆఖరికి తన తెలివి తేటలు సామర్థ్యం తో. టిఫిన్ సెంటర్ ఆపై 50ఏళ్లు హోటల్ దిగ్విజయంగా నడిపారు.తల్లికూడా తెలివి కలది.చదువురాకున్నా భర్త కి తోడు నీడ గా ఉండేది.ఆమెకి తోడుగా మహేష్ అనే6ఏళ్ల స్వంత తమ్ముడిని పెంచి స్కూల్ చదువు ముగియడంతో ఫ్యాన్సీషాప్ పెట్టించారు.శైలజనిచ్చి పెళ్లి చేశారు.అలా భర్తతో పాటు నేడు శైలజ భరత్నగర్ లో 20ఏళ్ళబట్టి రకరకాల గాజులు ఫ్యాన్సీ వస్తువులు ఇలా కొత్త కొత్త ఐటమ్స్ తెప్పించి రోజు 9నుంచి బిజీగా ఉంటారు.మంచితనం మర్యాద ఆదంపతులసొత్తు.
శైలజ శాంతి నికేతన్ కాలేజీ లో ఇంటర్ పూర్తి చేశారు.బాలానగర్ నవభారత స్కూల్ లో 10వక్లాస్ 80%తో ఇంగ్లీష్ మీడియం పాసైనారు.బడిలో కోఎడ్యుకేషన్ ఐనా పిల్లలంతా కల్సి ఆడేవారు.ఈమెకి లెక్కలంటే చాలా ఇష్టం.శైలజ అమ్మ నాన్నలు 6నెలల తేడాతో చనిపోయారు.శైలజ తమ్ముళ్లను భర్త మహేష్ కుమార్ చదివించారు.
పెద్ద తమ్ముడు ఇంజనీర్ చిన్న తమ్ముడు బిజినెస్.ఇక తమ బిజినెస్ వివరాలు ఇలా చెప్పారు.లక్షరూపాయలు పెట్టుబడి తో మొదలు పెట్టారు.వ్యాపారంలో ఎగుడు దిగుడు ఆటుపోట్లు తప్పవు.భర్త నెలకోసారి బేగం బజార్ వెళ్లి కొత్త ఐటమ్స్ తెస్తారు.

అయ్యపమాల వేసుకుని 41రోజులు భర్త దీక్ష లో ఉంటే ఆమె అన్నీ తానే చూసుకుంటారు.2003లో పెళ్లి ఐంది.ఇద్దరు అబ్బాయిలు 10 ఏడవక్లాస్ చదువు తున్నారు.స్వయంగా వారి చదువు సంధ్యలు చూస్తారు ఆమె.పిల్లలు 85/95%మార్కుల్తో చురుకుగా ఉన్నారు.చిన్నబాబుకి ఒలింపియాడ్ లో మెడల్స్ వచ్చాయి.డ్రాయింగ్ క్రికెట్ పిల్లలకి ఇష్టం.మేము లింగాయతులం.నియమనిష్ఠలు ఎక్కువే.పిల్లలు బాగా చదివి వారి కి నచ్చిన ఫీల్డ్ లో ఉన్నతస్థాయి లో ఉండాలని ఆదంపతుల కోరిక.తోడు నీడగా ఒద్దికగా సంసారం వ్యాపారం చేస్తున్న ఈ దంపతులు పరోపకారం పరాయణులు.వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలి అని శైలజ దంపతులకు తరుణి తరుఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కాకి పిల్ల…..

ఆపాత మధురాలు part-15