తెలుగు భాష విశేషాలు

         రంగరాజు పద్మజ

తెలుగు భాష విశేషాలు, తెలుగు వ్యాకరణ విశేషాలు ధారావాహికంగా తెలుసుకుందాం.
తెలిసినా మళ్లీ ఓ సారి గుర్తు చేసుకుందాం. ఉదాహరణ లతో విశ్లేషణ చేసుకున్నట్టైతే మన ముందు తరం వారికి చెప్పగలం .
తెలుగుపదాలు 5 రకాలుగా ఉంటాయి.
1.తత్సమం:-సంస్కృత ,ప్రాకృత పదాలతో సమానమైన పదాలను తత్సమాలు అంటారు.వీటినే ప్రకృతులు అంటారు.
రామ ,కృష్ణ ,హరి ,కవి ,విష్ణు ,సీత సావిత్రి……

2.తద్భవం:-సంస్కృత ,ప్రాకృత పదాల నుండి పుట్టిన పదాలను తద్భవాలు అంటారు.
కుడ్యము…గోడ, శ్రీ…సిరి , శాస్త్రము…చట్టము. స్ర్తీ… ఇంతి……
3.దేశ్యం :-అచ్చమైన తెలుగుపదాలను దేశ్యము అంటారు.
ఊరు ,పేరు ,కోతి , మూతి ,అమ్మ ,నాన్న….

4.అన్యదేశ్యం:-ఇతరభాషలనుండి వచ్చిన పదాలను అన్యదేశ్యాలు అంటారు.

సంస్కృత ,ప్రాకృతపదాలు కాక ఇతర భాషలనుండి వచ్చినపదాలను అన్యదేశ్యాలు అంటారు.

1.తమిళపదాలు:- తిరుచూర్ణం ,తిరుమాళిగ , తిరుపావి ,ఆళ్వార్ ,పిళ్ళై ,సాంబారు ,సాపాటు ,వడ ,తిరుపతి ,తిరుమలై ,ఇడ్లీ ,దోస,ఉప్మా ,తాయారు ,అలుమేలుమంగ,నంది ,మొదలియార్ ,సంబళం ,అణ్ణామలై ,నయనార్ ,ఆరంగేట్రం ,తోమాల ,ముక్కాల్

కన్నడపదాలు:-హంగు ,హొయలు ,హాళిగలు ,బేడలు,పుంటికూర ,బాడుగ ,బాలేపండు(అరటిపండు)కైవారం ,దేవర ,హెచ్చు ,నంగనాచి ,గండరగండ ,అరసు ,బసవ ,హొన్ను ,హోదా ,హేమాహేమీలు ,మజ్జిగె ,హోరాహోరీ ,హారతి ,హాజరు ,సాకు ,హాయి ,గడ్డ ,గండపెండారం.బాడుగ

ఒరియాపదాలు:-పన్నె..(దువ్వెన),భోగట్టా(సమాచారం),పెయ్య,
కంబారి(నౌకరి) బుగత (యజమాని) భోగట్టా (సమాచారం)రేక (చేద),కంబారీ (జీతగాడు),ఊబాలు(ఊడ్పులు),మొరియలు(మరమరాలు)

మరాఠిపదాలు:-కులకర్ణి ,చెకడాబండి ,భళిభళీ ,రాహుతులు(సైనికులు),ఉగ్రాణము(సామానులు పెట్టుకొనే చోటు ), ఖంగార్(కంగారుగా) చాడీ ,చావడీ ,బిడారు ,పాగా ,రామో (రావు) ,శివాజీ ,కాగడా ,కొరడా ,పంచె ,కిచిడీ ,గంజాయి ,గస్తి ,కిరాణా ,పిడేలు ,రావు ,పంతులు ,కిరాయి ,లోటా ,డేరా

ఉర్దుపదాలు:-కలం ,కాగితం ,కమీజు కౌలు ,నవాబు ,నౌకర్ ,రసీదు ,వసూల్ ,సుల్తాన్ ,ఖైదీ ,ఖైదు ,గుస్తా ,తాకీదు ,దస్తావేజు ,అల్లా,గులాం ,ఫకీర్ ,మసీదు ,సలాం ,మక్కా ,కుర్తా ,చర్ఖా ,చాకు ,జరీ ,ఖరీదు ,ఖర్చు ,కండువా ,లంగా ,ఫిరంగి ,దర్యాప్తు ,కచేరి ,వకల్తా,ఖిల్లా ,సిపాయి ,బందోబస్తు ,దివానా ,తుపాకీ ,బంద్,జాగీర్దారు ,తహసీల్దార్ ,సిరస్తాదార్ ,గుమస్తా ,షరాబు ,ఫిర్యాదు ,ఫసలీ

అరబ్బీపదాలు:-జిల్లా ,జిద్ ,జరీ ,తారీఖు ,ఖబుర్ ,కైపు

తర్కీపదాలు:-కుర్చీ ,తుర్కీ ,తురక

పోర్చుగీస్ పదాలు:-బాల్చీ ,పీపా ,అల్మారా ,మేజా ,సబ్బు ,ఇస్త్రీ ,కమాజు ,కాజా ,బొత్తం ,తువ్వాలు ,అనాస ,బొబ్బాయి ,క్యాబేజీ ,కమాను ,పటాలం ,కోస్తా ,గిడ్డంగి ,గోదాం ,బంకు ,బిస్కెత్తు ,బాతు ,మేస్త్రీ ,

డచ్చిపదాలు:-కక్కుసు ,బత్తాయి ,పంపర మాస ,నీల్కోల్ దుంప ,

ఇంగ్లీష్ పదాలు:- డ్యాన్స్ ,ప్యాషన్ ,సినిమా రోడ్డు ,పెన్ ,బెంచ్ ,బాల్,కమీషనర్ ,కలెక్టర్ ,డ్యూటీ ,సెక్రటరీ ,మేయర్ ,కోర్టు ,జైల్ ,టీ ,కాఫీ ,బస్ ,కారు …

హిందీపదాలు:-అంగూర్ ,కిమ్మత్తు ,కుశాలు ,దివాలా ,మెహర్బానీ ,పాకీ ,బడాయి ,దోస్త్ చూడీదార్ ,మినహా ,సతాయించు ,భరాయించు ,

ప్రెంచిపదాలు:-మసీదు ,నవాబు ,అమీర్
కిచెన్ ,మేడమ్ ,బీరువా,మీటరు ,కిలోమీటరు ,లీటరు ,కిలోలీటరు ,గ్రాము ,కిలోగ్రాము

5.గ్రామ్యం:-వ్యాకరణమునకు విరుద్ధంగా ఉన్నపదాలను గ్రామ్యం అంటారు.
వస్తాడు ,తెస్తాడు ,వచ్చేటి ,తెచ్చేటి
ఇలాగే భాషా విశేషాలు, వ్యాకరణ విశేషాలు ముందు ముందు మరిన్ని తెలుసుకుందాం!

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన

నాలో- నేను