గోరింటాకు పెట్టుకుంటే చలువ అని ఆరోగ్యం బాగుంటుంది అని మనం దేశ వాసుల నమ్మకం. ఆషాఢ మాసం, జూన్ జూలై నెలల్లో అప్పుడప్పుడే వానలు కురుస్తుంటాయి, చల్లగా ఉంటుంది వాతావరణం కూడా! కానీ శరీరం లో సహజసిద్ధంగా ఉన్న వేడి ఇంకా తగ్గదు. కాబట్టి గోరింటాకులోని చలువగుణం మంచిదనీ, రోగనిరోధక శక్తిని పెంచే తత్వం కలిగి ఉంటుందనీ , రక్త ప్రసరణ కూ మంచి చేస్తుందని స్త్రీలు, పురుషులు అంతా తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. దీన్ని మైదాకు అంటాం. మైదాకు చెట్టు ఆకులను మెత్తగా రుబ్బుకుని ఆ ముద్దను రకరకాలుగా చేతులకూ కాళ్ళకూ అలంకరించుకుంటారు. స్త్రీలు ఆరోగ్యం తో పాటు అందం గానూ ఉంటుందని తప్పని సరిగా ఈ గోరింటాకును పెట్టుకుని ఆనందిస్తారు.
మీరు చూస్తున్నది దేవులపల్లి కుటుంబం, కూతుర్లు కోడళ్ళు కలిసి ఆహ్లాదంగా జరుపుకుంటున్న ఆషాఢ మాస గోరింటాకు సంబరాలు.ఈ సందర్భంగా ఆటలపోటీలు పెట్టుకున్నారు. దేవులపల్లి ఇంటి ఆడపడుచు రూపా దేవి గారు ఎంత చక్కగా పాట పాడారో వినండి. ఇలా మన సంస్కృతి సంప్రదాయాల పేరిట జరుపుకునే వేడుకల విశేషాలను తరుణి తో పంచుకోవడం తో తరుణులందరినీ కలుసుకున్నట్లు సంతోషంగా ఉంది. ఎంతోమంది ఆడవాళ్ళ లోపల సహజంగా ఉన్నటువంటి సృజనాత్మకత కళలు ఇలా నలుగురి మధ్యనైనా ప్రదర్శించి ఎందరికో స్ఫూర్తి దాయకం గా ఉండడం ఎంత మంచి అలవాటు కదా.కుటుంబాలు బలంగా తయారవ్వడానికి , స్థిరంగా నిలబడడానికి ఈ వేడుకలు అవసరం మీరేమంటారు.