ఇంగ్లీష్ వింగ్లీష్

సమీక్ష

లక్ష్మీమదన్

మధ్యతరగతి ఇళ్లల్లో ఉండే స్త్రీలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారో తెలిపిన ఒక అద్భుతమైన సినిమా ఇంగ్లీష్ వింగ్లీష్. ముందుగా సినిమాకు అవసరమైన కథను ఎంపిక చేసుకున్నందుకు మూవీ టీమ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
నిజంగా ఒక స్త్రీ మనస్తత్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించారు …అందులో మధ్యతరగతి స్త్రీ అయితే గృహిణిలుగా ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించారు ముఖ్యంగా ఏది మాట్లాడినా ఇంట్లో కూడా చులకనగా చూడడము ఏమి మాట్లాడినా నవ్వడం చేయడంవల్ల వచ్చినది కూడా మర్చిపోయే అవకాశంఉంటుంది అలాంటివన్నీ ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు …ఈ సినిమా నేను ఎప్పుడో చూశాను కానీ సమీక్ష రాయాలని ఆలోచన ఎప్పుడూ రాలేదు ఆ సినిమా చూసిన తర్వాత మదిలో అంతర్మాథనం జరుగుతూనే ఉంది ఇంచుమించు నాలాంటి స్త్రీలు ఎదుర్కొనే సమస్యనే ఇది …ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా రాకపోవడం నలుగురిలో ఎక్కువగా తిరగకపోవడం వల్ల మాట్లాడే విధానం సరిగా తెలియకపోవడం ..లోపల నుండి భయం మొహం లో బెకుకుదనం ఇవన్నీ మధ్యతరగతి మహిళలు ఎదుర్కునేవే…

ఇక ఇందులో నటించిన సౌందర్యరాశి శ్రీదేవి గురించి చెప్పడానికి మాటలు చాలవేమో ఎంత చక్కని ఎక్స్ప్రెషన్ చూపించిందో చెప్పలేను సగటు మహిళగా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రవర్తి ఏర్పరచుకుంటుంది తనకు ఇష్టమైన లడ్డు తయారు చేయడం ఒక చిన్న వ్యాపారంలా ఇంట్లో నుండే నడుపుకుంటూ నలుగురికి అందజేస్తూ సంతోషంగా ఉంటుంది కానీ ఇంట్లో దానిని కూడా తక్కువ చేసినట్లు చూస్తారు పిల్లలు కూడా తక్కువ చేసి చూడడం ఇంగ్లీషు రాదు అన్నట్లు చూడటం చూపించారు ఆ టైంలో ఆమె మానసిక స్థితిని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు అసమానమైన నటన ప్రతిభ శ్రీదేవి గారు చూపించారు…. ప్రతిసారి ఆమె ఆత్మ న్యూణ్యతకు లోనైనప్పుడు నన్ను నేను చూసుకున్నాను అంటే అతిశయోక్తి కాదు బయటకు వెళ్ళినప్పుడు ఆ మొహంలో భయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది…. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె అమెరికా వెళ్లడం భయపడుతూ వెళ్ళినా కూడా అక్కడ ఆమె ఇంగ్లీష్ క్లాస్ లోకి వెళ్లి భయం పోగొట్టుకొని శ్రద్ధగా ఇంగ్లీష్ నేర్చుకోవడం తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకోవడం క్లాస్లో ఆమెను ట్రేైనర్ మెచ్చుకోవడం ఇవన్నీ ఎంతో బాగా అనిపిస్తాయి తడబడుతూ అడుగులు వేస్తూ వెళ్లిన ఆమె ఆత్మస్థైర్యంతో అడుగులు వేస్తూ వస్తుంది రాను రాను ఆమె శ్రద్ధగా మరింత మెరుగులు దిద్దుకొని ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. తన తోటి క్లాస్మేట్ వల్ల తనంటే తనకు శ్రద్ధ పెరిగిందని తన స్పీచ్ లో చెప్తుంది..

తన సోదరి ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు పనులలో జోక్యం కలగజేసుకుంటూ అన్నీ తానుగా తిరుగుతూ ఇటు క్లాసులు అటెండ్ అవుతూ తనకంటూ ప్రత్యేకత ఉన్న తన విద్య లడ్డూని పెళ్లి గురించి చేస్తూ హడావుడిగా ఉంటుంది… చివరగా క్లాస్ ఎగ్జామ్ కు అటెండ్ కాలేక పోతుంది కానీ తన అక్క కూతురు ద్వారా తన క్లాస్ మొత్తం ఇక్కడికి వచ్చేలా జరుగుతుంది …అప్పుడు పెళ్లిలో ఆమె అందరికీ తను చేసిన లడ్డూలు పంచుతుంది అప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ టీచర్ ఆమెకి ఇక్కడే ఎగ్జామ్ పెడతాడు ఎలాగంటే పెళ్లిలో అందరూ వారి అభిప్రాయాలు వాళ్ళు చెబుతుంటారు అప్పుడు శ్రీదేవి మాట్లాడాలనుకున్నప్పుడు ఆమె భర్త ఆమెకు ఇంగ్లీష్ రాదు అని చెప్పి కూర్చోమంటాడు కానీ తాను మాట్లాడతాను అని చెప్తూ చక్కని భావనతో ఎంతో చక్కగా పెళ్లి గురించి మాట్లాడి అందర్నీ ఆశ్చర్యానికి లోను చేస్తుంది ఇన్నాళ్లు చులకనగా మాట్లాడిన కూతురు కన్నీళ్లు పెడుతుంది భర్త ఆమెకున్న జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోతాడు తర్వాత సిగ్గు పడి తలవంచుకుంటాడు ఇలా చక్కగా ఒక మహిళను చూపించిన తీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎన్నో ఇలాంటి సంఘటనలు నాలాంటి మహిళలు ఎదుర్కొనే ఉంటారు నేను మొదటిసారి ఒక్కదాన్నే విమాన ప్రయాణం చేసినప్పుడు ఎయిర్పోర్టులో భయపడ్డ సంఘటనలన్నీ నాకు గుర్తొచ్చాయి కానీ మన ప్రయత్నం మనం చేస్తే ఈ పిరికితనంతో నుండి బయటపడి ఎంతో నేర్చుకోగలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కావలసింది కాన్ఫిడెన్స్ ఇది ఎవరో ఇస్తే వచ్చేది కాదు మనకు మనమే కాన్ఫిడెన్స్ ఇచ్చుకోవాలి ఎవరో నాకు అవకాశం ఇవ్వలేదు అని అనుకోవడం మూర్ఖత్వమే ప్రయత్నించు సాధించడంలో ఎంతో సంతోషం ఉంటుంది విషయమనే శిఖరాన్ని అధిరోహించవచ్చు… ఏది ఏమైనా శ్రీదేవి లేదు అనే విషయం గుర్తొచ్చి బాధ కలిగింది ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా అద్భుతమే మరి!

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కదలిరారా

వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి