కదలిరారా

చైతన్యగేయాలు

డా. చీదేళ్ల సీతాలక్ష్మీ

పల్లవి..  కదలిరారా ఓ యువకా
తరలిరారా ఓ నవ యువకా
కాలమేమో ఆగనంటుంది
గాలమేసి పట్టు దాన్ని
( కదలి రారా…)

1.చరణం..  పబ్బులంటూ క్లబ్బులంటూ
తిరుగుచుంటివి యువకుడా
మత్తులోన తూలిపోతూ
లక్ష్యమేమో మరచిపోతివి..
( కదలి రారా..)

2.చరణం.. స్వేచ్ఛ పెరిగి డబ్బుపెరిగి
కన్న వారిని తలవవైతివి
చేయి జారగ జీవితమ్ము
వెనక చూచిన మిగులు వేదన..
(కదలి రారా..)

3.చరణం.  మంచి బాటలో నడువవోయి
మంచి స్నేహము చేయవోయి
నష్టపోయిన కాలమెంతో
వగచినను నీవు తిరిగిరాదోయి.
( కదలి రారా..)

4.చరణం.    బ్రతుకు నీది తెలివి నీది
అనుకున్న తీరము చేరవోయి
అలసించక ముందు నడిచి
పదిమందికి ఆదర్శమైపో..
(కదలి రారా. .)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తెలుగు సాహిత్యంలో గ్రంథ పరిచయం

ఇంగ్లీష్ వింగ్లీష్