తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిపట్నంలో ఉన్న ఈవృద్ధురాలు ఎంచక్కా కళ్లజోడు లేకుండా పుస్తకం చదవగలరు.చెవులు బాగా వినిపిస్తాయి.ఈమెకి ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు.అందరినీ చదివించారు.భర్త మిలటరీ లో ఉండి రెండో ప్రపంచ యుద్దంలో పాల్గొన్నారు.కాంతమ్మగారు పొలం పనులు పశువుల ఆలనాపాలనా చూసేవారు.ఇప్పటికీ ఆవులు గేదెల దగ్గర వాటి శుభ్రత పేడతీయడం గడ్డి అందించటం చేస్తున్నారు.ఆంగ్ల మిలిటరీ వారి కి ఆమెలాంటి చేసి వారి మెప్పు పొందారు.క్రిష్టియన్ మిషనరీవారే ఈమె పిల్లలని చదివించారు.అంతా బాగా చదువుకుని పెళ్లి అయి జీవితంలో స్థిరపడ్డారు.ఈవృద్ధురాలు హిందీ మలయాళం ఆంగ్లం కూడా మర్చిపోకుండా ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు.
విషయ సేకరణ: శ్రీమతి దీప్తి