వంటింటి కళ

మసాల ఫిష్ ఫ్రై

 

కొర్రమట్ట చేప ముక్కలు 1/2 కేజి
నూనె 200గ్రాములు ఉల్లిపాయ 1మీడియం సైజు
పల్లీలు 40గ్రాములు
నువ్వులు 25గ్రా
ఎండు కొబ్బరి 40గ్రా
అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1/2స్పూన్
కారం 3స్పూన్స్
ఉప్పు 1స్పూన్
పసుపు 1/2స్పూన్
ధనియాల పొడి 1స్పూన్
గరం మసాల పొడి 1/4స్పూన్
జిలకర మెంతి పొడి 2చిటికెలు
నిమ్మకాయ 1


ముందుగా చేప ముక్కల్నిఒకసారికడిగాక నిమ్మకాయ రసం,ఉప్పు వేసి బాగా పట్టించి రెండుసార్లు కడిగాలి. అప్పుడు ముక్కలు వాసన లేకుండా, తెల్లగా అవుతాయి. తర్వాత పల్లీలు, నువ్వులను వేయించాలి.
చల్లారిన తరువాత వీటిని కొబ్బరి ని పొడి చేయాలి. ఈ పొడిలో అల్లంవెల్లుల్లి పేస్ట్, అన్ని పొడులు, కాస్త నూనెలోవేయించిన ఉల్లి ముక్కలు వేసి కొన్ని నీళ్లు పోసి ముద్దగా పేస్ట్ చేసుకోవాలి. కారం, ఉప్పు రుచి చూసి అవసరమైతే మీకు తగినంత కలుపుకొని బాగా కలిసేలా మిక్సీ పట్టాలి .దీనిలో నిమ్మరసం కలిపి చేప ముక్కలకి పట్టించాలి.స్టవ్ పై పెనం పెట్టి వేడెక్కాక 200గ్రామ్స్ లో సగం 100గ్రామ్స్ నూనె పోసి, మంటని మీడియం చేసి,సగం చేప ముక్కలను ఒక్కొక్కదానికి పేస్ట్ బాగా పెట్టుకుంటూ నూనెలో పెట్టాలి. ముక్కలకి పైన వైపుకూడాపేస్ట్ బాగా పెట్టాలి. దీనిపై ఒక మూత బోర్లించి పెట్టి 3,4నిముషాలు ముదురు బంగారు రంగు వచ్చేలావేయించి, మూత తీసి మరోవైపు తిరగేయాలి. ఇప్పుడు మూత పెట్టకూడదు. రెండోవైపు కూడా మంచి రంగు వచ్ఛేలా వేయించి తియ్యాలి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన ముక్కలను కూడా ఇలాగే వేయించాలి. మసాలాని అన్నంలో కలుపుకొని తింటూ, చేప ముక్కలను మధ్య మధ్య లో నంజుకొని తింటూవుంటే, ఆహా ఓహో అదరహో అన్నట్టుంటుంది. మీరు వండుకొని తిన్నాక ఎలా ఉందో చెప్పండి. ఒక మంచి వంట మీకు పరిచయం చేసానన్న తృప్తి నాకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేను అమ్మనా?

ఆ వయసింకా రాలేదు