అగ్నిమిళే

శ్రీ రేఖ బాకరాజు

ఓం అగ్ని మీళే పురోహితం యజ్ఞస్య దేవా ఋత్విజమ్

హోతారం రత్నధాతమం

ఈ మంత్రము ఋగ్వేదములోని మొదటి అధ్యాయములోని మొదటి మండలములోని మొదటి మంత్రము. ఈ మంత్రమును పూజలలోనూ యజ్ఞ యాగాదులలోనూ విశ్వశాంతి కొరకై చదువుతారు. మనందరికీ తెలుసువేదాలు నాలుగని. ఋగ్వేదములl యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము.  భగవంతునిచే తపస్ సంపన్నులైనటువంటి మహా యోగిపుంగవుల హృదయాలలో వేద మంత్రాలు స్ఫురింప చేయబడినవని చారిత్రాత్మకంగా  తెలియుచున్నది. 

ఇప్పుడు మనము ఈ మంత్రము యొక్క ప్రతిపదానికి భావార్ధములను తెలుసుకుందాము.

అగ్ని మీళే  —–నేను అగ్నిని ప్రార్థిస్తున్నాను

పురోహితం — ఈ యజ్ఞమునకు పురోహితునిగా ఉండమని అర్థిస్తున్నాను

యజ్ఞస్య —- ఈ యజ్ఞమునకు లేదా హవనమునకు.  హవనమునకు మరొక పేరు యజ్ఞము దానినే దేవ యజ్ఞము అని కూడా అంటారు

దేవా — దేవునికిచ్చే హవిస్సులందు

ఋత్విజమ్ – –ఈ పురోహితులందరిలోను

హోతారం —-  హోత అనే పురోహితునిగా

రత్న ధాతమం —– అందరికీ ఆయురారోగ్యాలు దానంయూ యశస్సు  ఇవ్వబడాలని ఆశిస్తున్నాము.

ఈ మంత్రమునందు మనము భగవత్ స్వరూపుడైనటువంటి అగ్నిని ప్రార్థిస్తున్నాము.

యజ్ఞకర్తయైన హోత సదుద్దేశముతో నిర్వహింపబడే ఈ యాగములో ఇచ్చే పవిత్రమైన హవిస్సుల ద్వారా అందరికీ ఆరోగ్యము సంపద మరియు అందరికీ మంచి జరుగవలెనని ఆశిస్తున్నారు.

యజ్ఞమునందు నలుగురు ముఖ్యమైన యజ్ఞకర్తలు ఉంటారు. వారు బ్రహ్మ, ఆధ్వర్య, ఉద్గాత ఇంకా హోత. ఉద్గాత యాగాన్ని ప్రారంభిస్తాడు, అధ్వర్యు హవిస్సుల ప్రాధాన్యతను సంతరించుకుంటాడు.సాంప్రదాయకంగా బ్రహ్మ ప్రధాన పూజారిగా పౌరోహిత్యం వహిస్తాడు. హోత ఆధ్వర్యంలో మంత్రాలను చదువుతారు. ఉద్గాత ద్వారా వినసొంపగు స్వరయుక్త మంత్రాలతో యాగం ఆరంభము నిర్వహింపడుచున్నది.

సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ మంత్రము ద్వారా అగ్నిస్వరూపుడైన పరమాత్మను యజ్ఞములో కిచ్చ్చే పవిత్రమైన హవిస్సులందు హోత గా వ్యవహరించామని కోరుతున్నాం.

ఎందుకంటే అగ్ని మాధ్యమముగా మనం యజ్ఞములో ఇచ్ఛే హవిస్సులను, వాటిలో ఉండే సామాగ్రి నెయ్యి పాలు మరియు సుగంధ ద్రవ్యాలను మొదలైన వస్తు సామాగ్రిని  పరమాణువులుగా మార్చి వాతావరణములో విస్తరింపజేస్తుంది. వాతావరణాన్ని శుద్ది చేస్తుంది. మన యాగం ద్వారా వాటిలో ఇచ్చ్చే పవిత్రమైన  హవిస్సుల ద్వారా  అందరికీ సదా మంచి జరగాలని, ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధి (రత్న ధాతమం) కలగాలని ఆశిస్తూ ఆశీర్వచనం కోరుతున్నాము. అందువలన ఈ మంత్రం చాలా ప్రభావం కలిగినది. దీనిని యజ్ఞం చేసేటప్పుడు ప్రధమంగా చదువుతారు.

ఉదాహరణకు యాగం ఒక రాజు అయితే అగ్నిదేవుడు  దేవతాస్వరూపుడైన ఒక ప్రధాన యజ్ఞకర్త. అతను యాగం ద్వారా వచ్చే హవిస్తుల ద్వారా వచ్చే సత్ఫలితాలను ఆశీర్వచనాలను యజమానుడైనటువంటి బ్రహ్మ ద్వారా అందరికీ సమర్పిస్తారు. రత్నధాతమం అంటే ఈ అగ్ని ద్వారా పవిత్రమైనటువంటి లక్షణాలను పవిత్రతను అందరికీ చేకూరాలని ఆశయం. కాబట్టి ఈ మంత్రము చాలా ముఖ్యమైనది మరియు ప్రాథమికమైనది.

 

 

Written by SriRekha Bakaraju

శ్రీరేఖ బాకరాజు
నా స్వీయ రచన: రాగ మాధుర్యం
పుట్టిన ప్రదేశం : హైదరాబాద్ తెలంగాణ
ప్రస్తుతం : టొరంటో కెనడా
చదువు: ఆంధ్ర మహిళా సభ, రెడ్డి ఉమెన్స్ కాలేజీ ఇంటర్ బి స్సీ, గోల్డ్ మెడలిస్ట్ ఎం స్సీ మాథెమాటిక్స్ మరియు ఎం.ఫీల్ మ్యాథమెటిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ
 
వృత్తి : సాఫ్ట్వేర్ ఇంజనీర్
ప్రస్తుతం : ఇన్వెంటరీ కంట్రోల్
కళలు : కర్ణాటక సంగీతం , హిందూస్థానీ సంగీతం మరియు సితార్ లో ప్రావీణ్యం  
తెలుగు భాష అంటే ఇష్టం.
కథలు కవితలు పాటలు రాయాలంటే
సరదా. నా రచనలకు బహుమతులు కూడా వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ధాత్రినాకలితీర్చు ధన్య జీవి

సుందరకాండ