సంచా(సా)రం

కథ

రాపోలు శ్రీదేవి

పక్కింటి పావని తో మాట్లాడుతున్న నేను రాత్రి ఏంటో ఇల్లు మారుతున్నట్టు కల వచ్చింది అన్నాను.

ఇప్పటికే ఎన్ని ఇల్లులు మారినాము ఇంకా అదే ధ్యాస…

కొత్తగా పెళ్లయి అత్తారింటికి వచ్చినా నాకు రేకుల ఇల్లు చూసి కంగారు పడ్డాను ఇంటికి డాబా లేదు నేను మా ఇంట్లో ఎక్కువ సమయం డాబా పైనే గడిపే దాన్ని …

అత్తగారింట్లో పొద్దున ముగ్గు వేయడానికి బయటకు వస్తే మళ్లీ పొద్దున్నే బయటికి రావడం ఆ టైంలో కూడా మా మామయ్య నాకు కాపలాగా నిలబడే వారు అంతా కేర్ తీసుకోవడం కూడా నాకెందుకో నచ్చలేదు.
స్టోర్ రూమ్ లాంటి ఇంట్లో పాత బట్టలు విరిగిన కుర్చీలు కుళ్ళిన కూరగాయలు మధ్యలో ఉండాలంటే ఇబ్బందిగానే ఉండేది.

అయినా అన్ని సర్దుకొని ఆ ఇంట్లోనే మూడు సంవత్సరాలు ఉన్నాను.

ఇల్లు అంటే ఎండ, వాన ,చలి నుండి రక్షించేది .
కానీ ఈ ఇంట్లో ఎండతో వేడి..
ఉడక బోత తో ఊపిరాడేది కాదు మా అత్తయ్య కిటికీలు కూడా తీయని ఇచ్చేది కాదు .
వర్షాకాలం మా ఇద్దరి మధ్యలో ఒక గిన్నె పెట్టుకోవాలి. చలికాలం ఎముకల కోరికే చలి ..

తర్వాత సొంత ఇంటికి వచ్చాము అంతా మంచిగానే ఉండేది కానీ చిన్న ఇల్లు ఎవరు వచ్చి ఉండాలన్న ఇబ్బందిగా ఉండేది..

మా పక్కనే ఆడపడచు వాళ్ళు
కలిసి పని చేసుకునే వాళ్ళం ..ఏ సందేహం వచ్చిన చక్కగా చెప్పేది…
చుట్టు చుట్టాల వాళ్ళు వారి తో కాలక్షేపం బాగానే ఉన్నాము.

కొన్నాళ్లకు పెద్ద అపార్ట్మెంట్ కి వెళ్ళాము.
అక్కడ పిల్లలు నేను మాత్రమే ఉండేది. శ్రీవారు ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉండేవారు.

అందరు ఉన్న వాళ్ళ మధ్యన మధ్యతరగతి జీవితం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా అందరిలో కలిసిపోయాం.

పిల్లలంతా కలిసి ఆడుకునేవారు కల్సి తినేవారు మొత్తానికి నలుగురితో ఎలా ఉండాలో నేర్చుకున్నా ను.

తర్వాత సంవత్సరానికి శ్రీవారి పనిచేసే స్కూల్లోనే ఉండాలని పట్టుబట్టి వచ్చాను కానీ… ఉండడానికి ఇల్లు లేక స్టోర్ రూమ్ లో ఉండే వాళ్ళం బాత్రూం కూడా లేక హాస్టల్ పిల్లలు వెళ్లే బాత్రూమ్స్ వాడేవాళ్ళం అది అబ్బాయిలది ఇబ్బందిగా అనిపించేది.
వాళ్లంతా వెళ్ళాక వెళ్లే వాళ్ళం.

అందరూ తిండి లేక చనిపోతే నీవు బాత్రూం లేక చనిపోతావా అనేవారు
శ్రీవారు.
ఎంతైనా బాగా ఇబ్బంది అనిపించింది.

అందరితో స్కూల్ మొత్తంలో మాది పెద్ద ఇల్లు అని నవ్వుతూ చెప్పేదాన్ని బాధనంతా దాచి పెట్టి ..
తర్వాత పక్క రూమ్లో ఏదో వుడ్ వర్క్ చేస్తుంటే డస్ట్ బాగా వస్తుంటే. ఎట్లాగో ఒక రూమ్ కి వెళ్ళాము.

తర్వాత న
మాకు ఒక పోర్షన్ కట్టిస్తే అందులోకి షిఫ్ట్ అయ్యాము.

అది రెసిడెన్షియల్ స్కూలు మా పిల్లలు చిన్న తరగతులు స్కూలుకు పంపించడానికి వీలుగాక టీచర్స్ తోటి ఏదో బేసిక్స్ చెప్పించేవారు. తర్వాత సంవత్సరం స్కూల్లో చెప్పిద్దామన్న బేసిక్స్ లేవని ఫస్ట్ క్లాస్ లో చేర్చుకోము అంటే కష్టపడి పాపను చదివిచ్చి సంవత్సరం వేస్ట్ కాకుండా దాన్ని ఎట్లాగో రెండో తరగతి పంపించా.

తర్వాత సంవత్సరానికి మళ్ళీ స్కూల్ ఇంకో బ్రాంచ్ కామారెడ్డి వెళ్ళాము.

అక్కడ ఊరి చివరన ఇల్లు
ఇల్లులన్ని ఒకేలాగా ఉండేవి.
అందరూ కలుపుగోలుగా ఉండేవారు.

అందరం కలిసి పండుగలు కూడా చేసుకునే వాళ్ళం బాగా అనిపించేది.

అక్కడ అలవాటు పడగానే కొన్ని రోజులకే మళ్ళీ వచ్చాము.
అద్దాల మేడ గెస్ట్ హౌస్ ..లోకి
దూరంగా ఉండి అందులో ఉంటే బాగుండు అనుకునే వాళ్ళం.
అందులోకి వచ్చేసాక ఎన్నో రోజులు లేము మళ్లీ హనుమకొండ బ్రాంచ్ కి వెళ్ళాము.

మళ్లీ చిన్న రూము అందులో మేము ఉంటూ సామానంత స్టోర్ రూమ్ లో వేస్తే ఎలుకలు కొట్టాయి. దాంతో అన్ని ఆ చిన్న రూమ్ లోనే
సర్దుకున్నాం.

అక్కడ అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కుటుంబ భారాన్ని మోయడం చూసి అలాంటి ఇబ్బందులు ఉంటాయని కూడా తెలియకుండా పెరిగాను అనుకున్నా

పుస్తకం బట్టి 15 ఏళ్ల తర్వాత మళ్లీ కాలేజీ బాట పట్టా…
చదువులు ఒంటికి పట్టడడమే కానీ కాలేజీ లైఫ్ బాగా ఎంజాయ్ చేశాను.

అక్కడినుండి మళ్లీ కామారెడ్డి వెళ్ళాము అక్కడ పచ్చని చేన్ల మధ్యన ఆహ్లాదకరంగా ఉన్నా కానీ…
ఏదో తెలియని ఒంటరితనం పిల్లలకు పాఠాలు చెప్తూ కాలక్షేపం.

కొన్నాళ్లకు మళ్ళీ ఘట్కేసర్ వచ్చేశాం.

అందమైన అద్దాల మేడ లో చెదలు పట్టి
ఎంతో ఇబ్బంది పెడుతున్న..
ఐదు యేండ్లు భరించి
చివరికి సొంత గూటికి
చేరుకున్నాం.
కానీ పిల్లలు పెద్ద ఇల్లు కావాలని ఆశ పడుతున్నారు..
అందరితో కలిసి ఆనందం గా గడిపే నాకు ఈ ఇల్లు వదలి వెళ్లాలని లేదు..
ఈ ఇంటికి వచ్చాక..
పిల్లలు ఉద్యోగ రిత్యా..చదువు రిత్యా
దూరంగా ఉండడం వల్ల నాకోసం నాకంటూ దొరికిన సమయాన్ని..సద్వినియోగం చేసుకొని..రచన వ్యాసంగాన్ని మొదలు పెట్టి నా కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నా
కలిసి వచ్చిన ఇల్లు అమ్ముకొని వెళ్లడం ఇష్టం లేకున్నా..
తప్పదు..

కొన్ని రోజులు లైబ్రేనుగా పుస్తక పఠనం చేస్తూ రచన మీద ఆసక్తి కలిగి కథలు రాశాను .
సైంటిస్ట్ కావాలనే నా కోరిక తీరలేదు కానీ ల్యాబ్ ఇన్చార్జిగా ప్రాక్టికల్స్ చేపిస్తున్నప్పుడు ఆ కోరిక తీరింది .
తర్వాత నాకు వచ్చిన చిత్రలేఖనం సృజన విద్యార్థులకు నేర్పిస్తూ వాళ్లలో సృజనా శక్తిని పెంచాను.

మా పాప క్లాసులో పిల్లలకు బేసిక్స్ తో పాటు పరీక్షలకు అవసరమయ్యే సబ్జెక్టు కూడా పజిల్స్ లాగా సరదాగా చెప్పేదాన్ని బ్లడ్ రిలేషన్స్ లాంటివి..

నాకంటూ ఓ సబ్జెక్టు గానీ సిలబస్ గాని లేవు..
ఒక్కొరోజు ఒక సబ్జెక్టుగా తీసుకొని పిల్లలకు ఆటపాటలతోటే అన్ని నేర్పించేదాన్ని చివరికి అక్షరాలు కూడా బొమ్మలతో నేర్పించేదాన్ని కొన్ని రోజులకు తెలుగు టీచర్ గా పని చేశాను.

ఇలా ఊరూరు తిరుగుతూ కొత్త కొత్త మనుషులతో పరిచయాలు ఏర్పరచుకొని వాటి ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం..
నాకు వచ్చినవి వాళ్లకు చెప్పడం… ఎక్కడికి వెళ్ళినా అందరితో కలుపుగోలు గా ఉండడం వల్ల నేను వెళ్లేటప్పుడు వాళ్లు నాకు కన్నీళ్ళతో వీడ్కోలు చెప్పేవాళ్ళు.

ఒక దగ్గర అలవాటు పడగానే మరో దగ్గరికి వెళ్లడం .
సామాన్లు మూటలు కట్టడం సర్దుకోవడం ఇదే పని ఒక బిల్డింగ్ లో పెంట్ హౌస్ దగ్గర నుంచి స్టోర్ రూమ్ దాకా అన్ని చోట్ల ఉన్నాము పిల్లలు కూడా అన్ని పరిస్థితులకు అనుకూలంగా ఉండడం ఆశ్చర్యము..

మా బంధుమిత్రులంతా..
ఓ మొబైల్ హౌస్ కొనుక్కొండి అంటూ
ఆట పట్టించే వారు..

శుభకార్యాలకు కూడా
ఎక్కడ ఉన్నారని పిలవాలని ఎగతాళి చేసేవారు..

అయినా.. మేము బాధ పడలేదు వెళ్లిన ప్రతి చోట
బడి పిల్లల భవిష్యత్ ని…మా పిల్లల భవిష్యత్ ని తీర్చి దిద్దుకున్నాం
ఆ తృప్తి చాలు….

అయినా..
ఈ సంచార సంసారం
ఏనాల్లో ఏంటో మరీ.

Written by Rapolu Sridevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రేమ ఎంత మధురం.

తప్పంతా వారిదేనా…?!