మంటలు కొడవళ్ళెత్తుతాయి
మగువ మనసు దహించినప్పుడు
ఆ రుధిరార్ణవ తేజస్సు
ఆ సద్గుణ ప్రతాపం స్త్రీ జగత్తు జాగృతి అవుతుంది
మగహంకార మర్మ లోకం
అడుగడుగునా
ఆవృతమయ్యేదే
అనుమానాలు విష కూపాల
మరో లోకం
లోపాలు వెతికే పనిలో
పాపాలు చేస్తూనే ఉంటాయి
మలినమంటని కమలిని
కల్హార వన్నె అది
సకల కళాత్మక దృష్టి కి ఓ స్ఫటికం
కథనో
గాథనో
కోటి కోటి గుండెల
కాఠన్యాన్ని
కమనీయతని కంటి చూరుకు
కట్టి
చూపు నిప్పులకూ
దృష్టి దృక్పథాలకూ
అసమానతలకు ఈ
అగ్నిప్రవేషాల అమానవీయతలకూ
చివ్వున తలెత్తే నిప్పుల ప్రతిధ్వని అవుతుంది
ఇప్పుడ చప్పున గుర్తుకొచ్చే యువత కు
నిన్ననూ ఈనాటినీ కన్నీటి భూగోళానికి కట్టి పడేసి
మనో దర్పణం లో
పట్టరాని పసిడి బొమ్మవుతుంది
సీతమ్మ అవుతుంది
చిత్ర కవిత రచన:-డాక్టర్ కొండపల్లి నీహారిణి
తరుణి సంపాదకురాలు