భగ భగలాడిన ప్రచండ భానుడు
సేద తీరుతున్నాడు.
నల్లని మేఘమాలికలు వర్షిస్తూ
గగనతలంలో తేలియాడుతున్నాయి.
పుడమి తల్లి చిరుజల్లులకు
మట్టి పరిమళాలు వెదజల్లుతోంది.
ప్రకృతి మాత తొలకరి చినుకులకు
పరవశించి పోతోంది.
గ్రీష్మ తాపంతో అతలాకుతలం అయిన
జీవజాలం జవసత్వాలు పుంజుకుంటోంది.
మేను తాకిన చల్లగాలికి మనసు పులకరించి
మబ్బుల్లో తేలియాడుతూ ఆనంద నాట్యం
చేస్తోంది పురివిప్పిన మయూరంలా.