కూరగాయల్లోకి మహారాజు వంకాయ అంటారు కదా.. ఏ చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా వంకాయ ఏదో విధంగా ఉండాల్సిందే.. ఎన్నో రకాలుగా చేసుకునే వంటకం కానీ ఇప్పుడు నేను చూపించేది వంకాయ సోగి అంటే పూర్వం రోజుల్లో మసాలా వంకాయలు వంకాయ సోకి అనేవాళ్ళు…
కావలసిన పదార్థాలు
అరకిలో వంకాయలు
పెద్ద సైజు ఉల్లిగడ్డ
నిమ్మకాయ సైజు చింతపండు
ఒక టమాట
కొత్తిమీర కరివేపాకు
పెద్ద చెంచాడు పల్లీలు నువ్వులు ధనియాలు..
చిన్న చెంచా జీలకర్ర
చిన్నబెల్లంముక్క
అవసరం ఉన్నంత నూనె.. ఉప్పు
🌹🌹🌹🌹🌹🌹🌹
తయారీ విధానం
వంకాయ మసాలా కోసం పాన్ లో కొంచెం నూనె వేసి ఎండు మిరపకాయలు ధనియాలు పల్లీలు నువ్వులు జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత కొంచెం నూనెలో ఉల్లిపాయ టమాటా వేయించి ఇవి అన్ని కలిపి పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరొక పాన్ లో నూనె వేసి తరిగిన వంకాయలను బాగా మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసి తరువాత పేస్ట్ గా చేసిన మసాలా ముద్దను మరియు ఉప్పు వేసి ముగించుకోవాలి ఇవి పక్కకు నూనె కొంచెం వదిలేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసి మరొక రెండు నిమిషాలు ముగ్గించుకొని సర్వింగ్ డిష్ లో తీసుకుంటే మసాలా వంకాయ రెడీ