కొత్తగా ఆలోచించాలి. అప్పుడే జీవితం మాధుర్య భరితం అవుతుంది. ఈ విషయాన్ని కవయిత్రి ,రచయిత్రి ,తెలుగు ఉపాధ్యాయురాలు కామేశ్వరి ఓగిరాల గారు తెలుగు వ్యాకరణం లోని అక్షర మాల నుండి అచ్చులు హల్లులు , వర్గాక్షరాలు, సంధులు సమాసాలు అలంకారాలు ఛందస్సు వంటివి నిత్య జీవితానికి అన్వయం చేస్తూ చక్కగా క్లుప్తంగా రాస్తున్నారు. సీరియల్ గా వచ్చే ఈ విశేషాలను చదివి ఆనందించండి.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు
వ్యాకరణం నేర్చుకుంటే దోషాలు సవరించుకొని భాషను అవగాహన చేసుకో గలుగుతాం
జీవితంలో ఎంతో మంది మనకు ఎదురవుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం. ఎవరు ఎలాంటి వారో, ఎవరితో ఎలా మెలగాలో తెలుసుకుంటే జీవితం లో పైకి వస్తాం.
అసలు వ్యాకరణానికి జీవితానికి పోలికలు ఉన్నాయా? లేవా? సంబంధం ఏమిటి ఎలా అన్వయించుకోవాలి? ఇప్పుడు పరిశీలిద్దాం.
మనుష్యులో లాగానే అక్షరాల్లో కూడా ‘క ‘వర్గం ‘చ ‘వర్గం ట వర్గం త వర్గం ‘ప ‘వర్గం వర్గాలున్నాయి. పద్యాలలో జాతులు ఉప జాతులు ఉన్నాయి.
మనష్యులలో కొంత మంది ఎదుటి వారిని తోసేసి వారు పైకి రావాలని చూస్తారు.
ఉదా :సవర్ణ దీర్ఘసంధిలో
దేవ +ఆలయం వ్ +అ, ఆ రెండింటిని తోసేసి “ఆ “వస్తుంది.
ఈ దీర్ఘంలాగానే మనుషులూ, వారి స్వభావాలు!
ఇలా ప్రతి చోట ప్రతి సందర్భంలో మనకు తెలియకుండానే జీవితం లో వ్యాకరణం ముడిపడి ఉంది