భూలోకాదధిపతుండా
పాశం లేని ధర్మ రక్షకుండా
మహిషం నెక్కిన బాలకుడండా!!
నేను ,
పల్లెఒడిలో ప్రకృతి బడిలో
బాల్యాన్ని గడుపుతున్న
పట్టేమంచం పై పాన్పు లేకుండా
మహిషం పై సేద తీరుతున్న
భూత దయా పరుండా
ఆలనా పాలనా ఏమి లేకుండా
పైరుల మధ్య తిరుగుతుండా!
అమ్మ చేతి స్పర్శలా
జోలపాడే పిల్ల తెమ్మె రల ఒడిలో
తియ్యని బాల్యాన్ని
కన్నీళ్ల సహవాసం లో వక్రించిన విధి చేతిలో
శిక్షంచబడిన ఓ బాలకుడను