అమ్మలం..!ఘుమఘుమలతో వడ్డించే తల్లులం!!
తల్లులం..! పిల్లలని పెంచి పోషించే ఈతరం వనితలం!!
వనితలం..! కుటుంబ ఆరోగ్యం కాపాడే వైద్యులం!!
వైద్యురాలే మన అమ్మ!! వైద్యాశాలే మన వంటిల్లు!!
మైదా మ్యాగీ వద్దు మిల్లెట్ నూడుల్స్ ముద్దు!!
పానీపూరి వద్దు గోదుమ పూరి ముద్దు!!
పిజ్జా బర్గర్ వద్దు మినప రొట్టి రోటి పచ్చడి ముద్దు!!
ఫ్రెంచ్ ఫ్రైస్ వద్దు ఆలు బజ్జి ముద్దు!!
చిప్స్ పాకెట్స్ వద్దు వెరైటీ అప్పడాలు ముద్దు!!
ఫాస్ట్ ఫుడ్ వద్దు హోమ్ ఫుడ్ ముద్దు!!
Refined నూనెలు వద్దు గానుగ నూనెలు ముద్దు!!
ఎప్పటికీ ఓకే భోజనం వద్దు ధాన్యపు వంటరకాలు ముద్దు!!
బేకరీ ఆహార ఆకర్షణ వద్దు!! ఆరోగ్య ఆహార కోరిక ముద్దు!!
రాత్రి అన్నం వద్దు సజ్జ, జొన్న రొట్టె ముద్దు!!
పాశ్చాత్య తిండి పోకడలు వద్దు మన మేటి శాస్త్రీయ పద్ధతులే ముద్దు!!
ఆరోగ్య సమాజానికి వజ్రపుబాట వేస్తుంది నేటి బోణి !!
రెస్టారంట్ షికార్లు వద్దు వనభోజన విహారయాత్రలు ముద్దు!!
యూట్యూబ్ వీక్షణ వద్దు శరీర వ్యాయామమే ముద్దు!!
దీపాలార్పుతూ కేక్ కటింగ్ వద్దు మంగళ హారతి దీవెనలే ముద్దు!!
వీడియో గేమ్స్ కాలక్షేపం వద్దు నానమ్మ తాతమ్మ ల కబుర్లే ముద్దు!!
వాట్సాప్ లోకం వద్దు కుటుంబంతో గడపటమే ముద్దు!!
సరదా వాహన షికార్లు వద్దు సహజ వనరుల భవిష్యత్తు బాధ్యతే ముద్దు!!
పర్యావరణ పరిరక్షణకే పట్టం కట్టింది పడతి!!
ముందుచూపుతో సేంద్రియ జీవన విధానంకు విజ్ఞానం కలుపుతోంది ముదిత !!
ఆ పాతఆత్మీయ జీవనమాధుర్యాన్ని తిరిగి రుచి చూపిస్తుంది అన్నువ!!
మట్టి వాసనకి దగ్గరగా సహజ జీవన శైలికి అంకురార్పణ చేస్తుంది నేటి మేటి మగువ!!