,సముద్రాల శ్రీదేవి , ప్రభుత్వ (govt) ఉపాధ్యాయిని స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా వ్యవహరిస్తున్నారు.
తల్లి దండ్రులు సముద్రాల వెంకటా చార్యులు.తల్లి విమలా దేవి.
చదువు ma, phd తెలుగు ప్రాచీన కవులు తులనాత్మక అధ్యయనం పై పరిశోధన చేసారు.
తండ్రి పండితుడు కవి కావడం చేత ఉగ్గు పాలతో రంగరించిన తెలుగు నుడికారాన్ని స్వంతం చేసుకొని ,తెలుగు భాషా వీచికలను వేనోళ్ళ ప్రసరింప చేస్తున్నారు.
తెలుగు భాషాపాధ్యాయినిగా విద్యార్థులలో తెలుగు భాష పై మక్కువ పెంపొందించే దిశగాకృషి చేస్తున్నారు. ,తెలుగు వ్యాకరణం, ఛందస్సు,అలంకారాలపై పట్టు సాధించే విధంగా బోధన గావిస్తున్నారు.
3) కవయిత్రి, మరియు రచయిత్రి, గాయని, నృత్య కళా కారిని, ,అన్ని కళలు మూర్తీభవించిన కళాకారిణిగా, బహుముఖ ప్రజ్ఞా శాలిగా వెలుగొందుతున్నారు.
3) కవితా పుస్తకములు20 ప్రచురితమైనవి ,
ఆముద్రితములు 10.
— శతకములు , కవితలు
కథలు ,గజల్స్ , నవలలు మొదలగు వివిధ ప్రక్రియలలో రాసారు , శతమానం భవతి నవల ఆంధ్రప్రభ దిన పత్రిక లో ప్రచురింప బడి అశేష జానా దరణ పొందినది.
సముద్రాల ఫౌండేషన్ స్థాపించి చైర్మన్ గా కవులను కళాకారులను సంఘ సేవకులను సన్మానించడంజరుగుతుంది
అవార్డులు::
1) రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డ్,
2, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్. స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్
3,, కవితా పుస్తకం అర్ణవ వర్ణమునకు ప్రతిష్టాత్మక మైన
గిడుగు రామ మూర్తి పంతులు అవార్డ్
4 వండర్ బుక్ ఆఫ్ రికార్డ్,
5 తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్
6 మార్వలెస్ బుక్ ఆఫ్ రికార్డ్ ,
7 ఎక్ట్రార్డినెరి రికార్డ్
8 —-ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ,
9
10 మల్టీ టాలెంటెడ్ పర్సన్ అవార్డు
11) dr,సి నారాయణరెడ్డి పురస్కారం.
12 గురుబ్రహ్మ పురస్కారం
13 ) అలిశెట్టి ప్రభాకర్ గారి సాహితీ పురస్కారం
సేవా భూషణ్ అవార్డ్
14 ) డైనమిక్ లేడి లెజెండరీ అవార్డ్
ఇతర అవార్డులు రివార్డులు పొంది యున్నారు
బిరుదములు,,, మహిళా సాహితీ శిరోరత్న, కవిచక్ర, కవి భూషణ, సహస్ర కవి మిత్ర , మహిళా శిరోమణి మరియు గాన కోకిల మొ” బిరుదములు ఆమె ప్రతిభకు మచ్చు తునకలు
సాహితీ విజయం పేరుతో వాట్సప్ గ్రూప్ అడ్మిన్ గా మరియు సాహితీ సముద్రం పేరుతో ఫేస్ బుక్ ను నడిపించి ఎందరో కవులను ప్రోత్సహిస్తున్నారు. సముద్రాల శ్రీదేవి పేరుతొ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు
12 గజల్స్ ను రచించి తానే స్వయముగా పాడినటువంటి ఘనత డా,సి.నారాయణ రెడ్డి తరువాత సముద్రాల శ్రీదేవికి మాత్రమే దక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
వివిధ పత్రికలలో కవిత్వం,పద్యాలు, వ్యాసాలు ప్రచురింప బడినాయి.
తెలుగు భాషకు శ్రీదేవి చేసిన సేవ బహుదా ప్రశంసనీయం
సీ…అమృతంబు ధారగ హాయిగ గొంతులో
పలికించు శ్రేష్ఠమౌ పాటలూరు
నృత్యభంగిములను నేత్రసీమలలోకి
కొత్తగ తాగించు కోరితాను
ఆపన్న హస్తమై దీపాలు వెలిగించి
లోకాలు కాచేడి రూపమయ్యె
సాహిత్య జగతిలో సవ్యసాచిగ నిల్చి
యన్నిప్రక్రియలలో యారితేరె
తేటగీతి
ఈ సముద్రాల శ్రీదేవి యిలకు జేరి
అపర బాసరంబగ మారి యద్భుతముగ
పంచు సకలకళలు నాత్మ వంచనంబు
లేక గాన పొగెదమిక లీలగాను
ఒకే రోజు ఒకే వేదికపై 16 పుస్తకాలు ఆవిష్కరించాను.
12 గజల్స్ పాడాను. వాటిని నా యూట్యూబ్ లో పెడతాను .త్వరలో
ఆదర్శవంతంగా, తరగతి గది వాతావరణం లో విద్యార్థులందరినీ ప్రేరేపించే ప్రదేశంగా ఉండేటట్టు గా చేసి ,ఉత్తమ ఫలితాలు సాధించారు.
బోధనో పకరణాలను ఉపయోగించడం
బహుమతులను ఇవ్వడం, ద్వారా స్పష్టమైన లక్ష్యాలను సాధించగలిగారు.
తల్లి దండ్రులు ప్రోత్సాహం ఇస్తే పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు రాణించగలరు అనటానికి ఉదాహరణ గా శ్రీదేవి గారిని చెప్పవచ్చు.భవిష్యత్తులో తన విద్యార్థులను గూడా ఆమె తీర్చి దిద్దుతారు అని ఆశిస్తూ తరుణి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది 🌹
సముద్రాల శ్రీ దేవీ ఫోన్ 9949837743