ఉదయపు కిలకిల రావాలు
సాయంకాలం పిచ్చుకల సందళ్ళలో
మనసు ఒక విరిసిన మందారం
తెల్లని మల్లెల నవ్వులు
గూడుకు గుడ్డుకు ఏనాటి బంధమో
గువ్వకు గూటికి ఉన్నట్టే
గడప గడపకు గట్టి నమ్మకం
వట్టి మాటలు కాదు
నిరీక్షణ మధురాతిమాధుర్యం అయినప్పుడు
గాలి సవ్వళ్లూ సవాళ్లను విసురుతుంటాయి
స్థిరచిత్తమో చేతన స్వరమో
ప్రాణి దైనప్పుడు
అంతా మంచి భావనా శోభితమే!
దినదినాభివృద్ధిలో భాగమే!
ప్రకృతికి పులకించని హృదయమెందుకు?
చిత్ర కవిత రచన:-
_ డాక్టర్ కొండపల్లి నీహారిణి