ఆమె పుట్టిపెరిగింది కళా సాహిత్య సాంస్కృతిక సంస్థల కాణాచి రాజమండ్రిలో.సంస్కృతం హిందీ తెలుగు లో దిట్ట “మణి”గారు తన జీవితాను భవాలను తరుణి తో పంచుకున్నారు.”ఐదుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్కలున్న పెద్ద కుటుంబం.ఆటపాటలు సినిమా కబుర్లు కాకరకాయలు షికార్లతో హాయిగా సాగింది నాజీవితం.ఆంక్షలు పెట్టని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మా అమ్మ నాన్నలు.
మా అమ్మ గారు స్వర్గీయ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి తమ్ముని పెద్ద కుమార్తె . తెలుగు సాహిత్యం మంచి అభినివేశం , వాగ్ధాటి కలిగిన మమతానురాగలు కలిగిన మాతృమూర్తి . 30 స॥ క్రితం తన 81సం॥ లో చనిపోయారు . ఆమె కు చిలకమర్తి వారి పూర్తి సాహిత్యం కరతలామలకం . నాకు బాల్యం నుండీ అన్ని విధాల ఆమె యే ప్రేరణ .
తెలుగు నుంచి హిందీ లోకి ముఖ్యమైన అనువాదాలు సి.నా.రె. భారతీయ జ్ఞానపీఠం ప్రచురించిన “ కవితా మేరీ సాంస్” లో కొన్ని కవితలు , “భూమిక “( కావ్యం) 2 . ఎన్ . గోపి గారి “జలగీతం “(కావ్యం) 3. ఉత్పల సత్యనారాయణాచార్య “యశోదానందగేహిని” 4. “యుగ నిర్మాతగా సాహిత్యకార్ :చిలకమర్తి లక్ష్మీనరసింహం” ( సాహిత్య అకాడమి 5 . సద్గురు శ్రీ శివానందమూర్తి గారి “ “కఠయోగ్ “(కఠోపనిషత్ యోగపరక్ వ్యాఖ్య ) , అనేక కవితలు , శ్రీ రావూరి భరధ్వాజ గారి కథలు మరెన్నో …….. సమీక్షాత్మక గ్రంథాలు . 1 . మహాదేవి కే కావ్య మే బిబవిధాన్ 2 ఆధునిక్ హిందీ నాటక్ :వివిధ్ ఆయామ్ ( హిందీ-తెలుగు ) 3 స్త్రీ విమర్శ్ : భారతీయ నవజాగరణ కాల్ (హిందీ-తెలుగు ) 4 . స్త్రీ వాద్ అవుర్ ఓల్గా కా సాహిత్య . 5 . దీర్ఘ వ్యాసాలు – గురజాడ , కాశీ యాత్రా చరిత్ర – ఏనుగుల వీరాస్వమి , తెలుగు మే పురాణ సాహిత్య్ , తెలుగు కా స్వతంత్రాపూర్వ …
2014 లో సద్గురు కందుకూరి శివానందమూర్తి గారి చేతులమీదుగా శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం ఒక అదృష్టం .
తన 27వ ఏట మాపెద్దక్క చనిపోవటం నాలో ఓవిధమైన కదలిక తెచ్చింది.అప్పటికి నావయస్సు12_13 మధ్య కావటంతో ఆలోచనలు మొదలయ్యాయి.1957_58లో ఓరియంటల్ స్కూల్ లో చేరి1963 లో ఎసెల్సీ పాసైనాను.సంస్కృతం ముఖ్యభాష.దానిపై బాగా పట్టు సాధించి అభిజ్ఞాన శాకుంతలం మాళవికాగ్ని మిత్రం అనే నాటకాలు బడిలో వేయటం అద్భుతమైన అనుభూతి.
1957_58లో ఓరియంటల్ స్కూల్ లో చేరి1963లో 11వక్లాస్ దాకా చదివాను.సంస్కృతం ముఖ్యసబ్జెక్ట్.శ్రీ శలాక రఘునాథ శర్మ గారు చెప్పేవారు.ఆంగ్లం ని మా హెడ్మాస్టర్ శ్రీ చల్లా ప్రసాద్ గారు చెప్పారు. నేను నాటకాల్లో గూడా వేశాను.మాఅమ్మ సుబ్బలక్ష్మి నాన్న నర్సింహమూర్తి గార్ల ప్రోత్సాహం తో ఆ కోఎడ్యుకేషన్ బడిలో ఆటలు వ్యాసరచన వక్తృత్వం లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ లు తెచ్చుకోవడం అందమైన అనుభూతి.శ్రీ దామెర్ల రామారావు గారు శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గార్లు ఆబహుమతులు ఇస్తుంటే నాచిన్ని మనసు పొందిన ఆనందం వర్ణనాతీతం.మర్చంట్ ఆఫ్ వెనీస్ కింగ్ లియర్ ఆంగ్ల నాటకాలలో పోర్షియా కింగ్ లియర్ గా నటించాను.మా అన్న అక్క హిందీ చదువు తోంటే నాకు ఆసక్తి పెరిగింది.అలా హిందీ లో పరీక్ష లు పాసైనాను.నాభర్త శ్రీ శంకర రావు గారి ప్రేరణతో హిందీ ఎం.ఎ. ఫస్ట్ రాంక్ లో పాసైనాను.ఉస్మానియా యూనివర్సిటీ లో హిందీ కవయిత్రి మ…
ఎం.ఎ సంస్కృతం , డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి
చేసిన ఆమె కి భర్త అండదండలు పుష్కలంగా లభించడం అదృష్టం.తెలుగు బిడ్డ హిందీ లో వెలుగులు పంచుతూ సాగుతున్న ఆమె కి తరుణి శుభాభినందనలు తెలుపుతోంది
Dr.P.Manikyamba “Mani “. A 608 , Aparna Sarovar Zenith, Nallagandla , Serilingampally , Hyderabad PIN 500019 ( Cell ) 9866139120 manikyamba@gmail. com