కొండలు, కోనలు
నిండైన సంద్రమూ
గుండె తెరపై తారాడే చిత్రం
కనులకు కలలకు నిండైన రూపం
కొలనులో తామరలు
తామరలతో లలన
అలా అలల నవ్వుల్లో ఓ పువ్వుగా
ఒకనాటి కథలో
కన్నె సౌదామిని
ఈనాటి బొమ్మలో
గిరిజన సౌగంధిక
ఆకాశం సాక్షిగా
నేల దిగిన తటిల్లత
నదీమతల్లి వరపుత్రిక
ఇక కవిత పొంగి పారదా
ఇలా కవి కోకిల కూయదా!
చిత్ర కవిత రచన – డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక సంపాదకురాలు
చిత్రం అంటే బొమ్మ. బొమ్మ అంటే … కన్నె సౌదామిని…అయినా కావచ్చు…. గిరిజన సౌగంధిక… అయినా కావచ్చు.
సౌదామిని…సౌగంధిక…పదాలు ……. ఈ చిత్రవ్యాఖ్యాన కవితలో చ ఒప్పిదమైన పాండిత్యపరమైన ప్రామాణిక పదప్రయోగాలు.
ఎడిటర్ డాక్టర్ కొండపల్లి నీహారిణి మేడమ్ గారు … అసాధారణ పండితులైన … ఒద్దిరాజు సోదరుల రచనలను గురించి సాధికారత గల పరిశోధన చేసిన పరిశోధకులు.
అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు