పువ్వు ఓ సుగంధి
పాపాయి నవ్వులా సుందరం
నిశి వేళ విరిసిన గగన కుసుమానివే
నువ్వు ఓ వెన్నెల పూబంతీ
ఇంత స్వాంతన నీ వెలుగు
ఇలాతలాన వెండి జిలుగువే!
ఆ చల్లని సముద్ర గర్భం దాల్చిన
నీలిమలన్నీ
అరవిరిసిన అలల చేతుల్లోంచి
మా కలల సౌధాల చేరుస్తూ
జలపాతాల హోరువయ్యావు
అవునూ ఈ వసంత ఋతు శోభ నుండి
రాబోయే గ్రీష్మానికి
ఎదకోయిల గీతానివౌతావా!
నీదైన ధర్మాన్ని నిజ దర్శనం చేస్తావు
నక్షత్ర మిలమిలలు
నెలకోసారి మల్లెల్లా
చూపిపోతావు
రాలిన చెట్ల ఆకులలో
కొత్త ఆశల్లా రంగులు మార్చే స్ప్రింగ్ సీజన్ వూ అవుతావు
శరత్కాల సౌందర్య వారాశివిగా
చిన్నారి చిత్రంలో బంధీవీ అవుతావు
ప్రకృతి ఒడిలో సేదదీర్చే
రేపటి పచ్చని ఊహవూ నీవే అవుతావు!!
చిత్ర కవిత రచన – డాక్టర్ కొండపల్లి నీహారిణి,
తరుణి సంపాదకురాలు.