మైలురాళ్ళు

కవిత

ఏ పాఠ్యగ్రంథం చూసిన

ఏమున్నది గర్వకారణం

మతి దప్పిన ఆలోచనలు

గతి దప్పిన పాఠ్యాంశాలు

విలువలకే తిలోదకాలు

ఇతివృత్తం, ఎంపికలోన

కథ, గేయం వ్యాసంలోన

సఁభాషణ, నాటికలోన

ఆటపాటల తీరుల్లోన

అయోమయ బాటల్లోన

 

చిన్నారుల వయసుకు మించిన

పసిపాపాల మనసుకు అందని

ఆలోచనల పరిధులు పెంచని

ఆనఁదపుటఁచులు తాకని

భావాలకు పదును పెట్టని

విషయాంశ ప్రదర్శనలోన

అంశ క్రమపద్ధతిలోన

అభ్యాస ప్రక్రియలోన

ప్రశ్నల రూపంలోన

పొంతనలేని జంతర్ మంతర్

‘అ’ అక్షరంతో పాఠం వద్దట

పలక బలపములె ప్రధానమంట

చిలుక పలుకులే పలుకు ‘బడులట’

కూరగాయలకు పాణిగ్రహమట

సొర కాయకు టమాట తాళి గట్టెనట

 

చదువు సంధ్యలకు గీటురాళ్ళట

లక్ష్యసాధనకు మైలురాళ్ళట

గుదిబండలుగా మెడకు చుట్టుకని

భాషను బందీ చేసి నిలిపెనట

పసి కన్నల పాలిట పరమ శాపమట

 

రాతల్లోన గీతలు వెట్టి

వాతలతో వీపులు వాయించి

చేతలతో మోతలు మోయించి

తలరాతలు మార్చని గీతలెందుకు?

విలువలు నేర్పని చదువులెందుకు?

 

భావిభారత భాగ్యసదనములు

పసిడి నిగ్గుల మిసిమి మొగ్గలు

విప్పారి విరిసె నందనవనమ్ములు

గుడిగా తలచే బడి ప్రాంగణములు

మదిలో పెరిగే మహోన్నత విలువలు

Written by Banda Sarojana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కన్నతల్లి అతని కల్పతరువు

భూ’me’ ని నేను!