భూమి గుండ్రంగా ఉంటుంది.సకల ప్రాణకోటికి నిలయమైంది. సముద్రాలు, నదులు,మైదానాలు, అడవులు భూ గోళం మీద ఉన్నాయి. ప్రాణవాయువు ఉండడం వలన ప్రాణులు మన గలుగుతున్నాయనే శాస్త్రీయ విషయం అందరికీ తెలిసిందే. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. దీన్ని మనం ఒకరోజు అంటాం.భూమి తిరిగేప్పుడు భూమికి ఎదురుగా ఉన్న సూర్యగ్రహం వెలుతురు సరిగ్గా ఒక అర్థ భాగం పైన పడుతుంది. దీనికి కారణం భూమి గుండ్రంగా ఉండడం. సూర్యుడు పడిన భాగం అంతా పగలుగాను సూర్యుని వెలుగు సోకని ఆ ప్రాంతం మొత్తం చీకటిగాను ఉంటుంది. వీటిని పగలు రాత్రి అంటాం.వెలుగు సోకిన ప్రాంతాన్ని పగలుగాను వెలుగు సోకని ప్రాంతాన్ని రాత్రిగాను మనం చెప్పుకుంటాం .ఒక రాత్రి ఒక పగలు కలిసి ఒక రోజు అవుతుంది. ఇలా 30 రోజులు ఒక నెలగా 12 నెలలు ఒక సంవత్సరం గా ఏర్పరుచుకున్నారు. భూ భ్రమణాల వలన ఋతువులు ఏర్పడతాయి. శీతోష్ణస్థితి మారుతూ ఉంటుంది.ఒక సంవత్సరంలో ఆరు ఋతువులు ఇమిడిపోయి ఉన్నట్టుగా గుర్తించుకున్నాం. రెండు నెలలు ఒక ఋతువుగా చెప్తాం. దీనికి కారణం ప్రకృతిలో కలిగే రకరకాల మార్పులను బట్టి కాలాన్ని ఈ విధంగా విభజన చేశారు. సూర్యుడు ఉత్తరం వైపుకు ప్రయాణం చేస్తున్నసమయాన్ని ఉత్తరాయనము అని ,దక్షిణం వైపు ప్రయాణం చేసే కాలాన్ని దక్షిణాయనమని రెండుగా విభజించుకున్నాము. ప్రస్తుతం జూన్ నెల తో ఉత్తరాయనము అయిపోతుంది .జూలై నుండి దక్షిణాయనము ప్రారంభమవుతుంది. భారతదేశ శాస్త్రజ్ఞులు ఏర్పర్చిన విశేషాల పరంగా 12 నెలలను వరుస గా చైత్రం, వైశాఖం, జ్యేష్టం , ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం ,కార్తీకం ,మార్గశిరం, పుష్యం ,మాఘం, ఫాల్గుణం అని 12 నెలలను మనం ఏర్పరచుకోవడం జరిగింది.ఇలా పేర్లు పెట్టడం జరిగింది .ఇదంతా కూడా ప్రకృతి పరిస్థితులను బట్టి విభజన చేశారు. చెట్లు చిగురించి పూలు పూస్తూ ఉన్న సమయాన్ని వసంత ఋతువు గానూ,ఇది చైత్ర వైశాఖమాసాలుగానూ చెప్తాము. ఎండలు బాగా కాసేటువంటి కాలాన్ని గ్రీష్మ ఋతువుగా అవి జేష్ఠ ఆషాఢ మాసాలుగా చెప్తాము .అలాగే వర్షాలు బాగా కురుస్తూ ఉండే కాలాన్ని వర్షఋతువుగా చెప్తాం.ఈ వర్ష ఋతువు శ్రావణ భాద్రపద మాసాల్లో వస్తున్నట్లుగా నిర్ణయించారు. ఆ తర్వాత శరదృతువుగా చెబుతూ ఉంటాము. ఈ ఋతువులో వెన్నెల బాగా కాస్తుంది అంత క్రితం కురిసినటువంటి వర్షాల తాలూకు బురుద అంతా ఇంకిపోయి ఉంటుంది. ఆ తర్వాత చలి మొదలవుతుంది. క్రమంగా చలి ఎక్కువవుతుంది ,మంచు కురుస్తుంది .దీన్ని మనం హేమంత ఋతువు గా ఏర్పరచుకున్నాము .మార్గశిర పుష్య మాసాలలో ఈ ఋతువు వస్తుంది. ఇక చిట్టచివరి ఋతువు శిశిర ఋతువు.ఇది ఏడాదిలో చిట్టచివరి ఋతువు. శిశిరంలో చెట్లు ఆకులను రాల్చి మోడువారి పోతాయి. ఈ ఋతువు మాఘ ఫాల్గుణ మాసాలలో వస్తుంది. ఇదంతా కూడా ప్రకృతి పరమైన ధర్మాలు.వీటికి మనం ఏర్పరుచుకున్న పేర్లు. ఈ ఋతువుల్ని బట్టే మూడు కాలాలుగా,ఎండ,వాన,చలి కాలాలు గా ఏర్పరిచాము .ఒక్కొక్క కాలం నాలుగు నెలలు. అవి వేసవి కాలము చైత్ర, వైశాఖ ,జ్యేష్ట మాసాలను వేసవికాలం గా అంటాము. తదుపరి వచ్చే శ్రావణ ,భాద్రపద ,ఆశ్వయుజ, కార్తిక మాసాలను వర్షాకాలంగా అంటాము. మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలు ఈ నాలుగు మాసాలను చలికాలం అని అంటాము. ఇలా ఋతువులను బట్టి కాలాలను కూడా నిర్ణయించుకున్నాం.
విశ్వం పుట్టిన వివరాలు, ఆకాశంలోని నక్షత్రాల విషయాలు గ్రహాల స్థితిగతులు, వాటి గమనాలను గురించి చెప్పే అధ్యయనం చేసే శాస్త్రము ఒకటి ఉంటుంది. దాన్ని ఖగోళ శాస్త్రం అని అంటాం. ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈ ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తుంటారు.దాదాపు 1500 కోట్ల సంవత్సరాల వయస్సు ఈ విషయాన్ని విశ్వం నిర్దిష్ట పరిణామానికి చేరుకోక వ్యాకోచిస్తూనే ఉంటుంది అని ఒక ఊహ .దీన్నే ‘బిగ్ బ్యాంగ్’ సిద్ధాంతం అని కూడా అంటారు. విశ్వాంతరాళంలో ఎన్నో గోళాలు కనిపిస్తాయి. నక్షత్రాలు ఉంటాయి. గ్రహాలు ఉంటాయి .ఇవన్నీ కలిసి ఒక విశ్వంగా ఏర్పడింది అని చెప్తుంటారు. వీటిలో నక్షత్రాలేమో స్వయంప్రకాశాలు .సూర్యుడు ఒక పెద్ద నక్షత్రం. సూర్యునికి భూమి దగ్గరగా ఉంటుంది .మిగిలిన నక్షత్రాలు భూమి నుండి చాలా కోట్ల కోట్ల మైదా మైళ్ళ దూరంలో ఎత్తులో ఉన్నవి. నక్షత్రాలకు నక్షత్రాలకు మధ్యన దూరం కూడా చాలా ఎక్కువే .నక్షత్రాల నుండి ఏదైతే కాంతి వెలబడుతుందో ఆ కాంతిని ఒక సెకనుకు ఎంత కాంతి అయితే ప్రయాణిస్తుందో ఆ ప్రయాణించే వేగాన్ని కాంతి వేగం అని అంటారు. అట్లా ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణం చేసినటువంటి ఆ ప్రమాణాన్ని కాంతి సంవత్సరం అనే పేరు పెట్టారు. దీని ఆధారంతోనే నక్షత్రాల మధ్య ఉన్న దూరాన్ని కూడా కొలుస్తూ ఉంటారు.
భూమి మీదికి సూర్యుని కాంతి చేరడానికి ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు పడుతుంది అని నిర్ణయించారు శాస్త్రవేత్తలు. సూర్యుడు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలను అన్నిటినీ కలిపి సౌర కుటుంబం అని పేరు పెట్టారు. దాదాపు 500 కోట్ల సంవత్సరాల వయస్సు ఉన్న సూర్యుడు ప్రధానమైన గ్రహం. సూర్యుడు భూమికి దాదాపు1500 ,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. బుద్ధుడు ,శుక్రుడు, భూమి ,కుజుడు ,గురుడు, శని, యురేనస్ ,నెప్ట్యూన్, ఫ్లూటో అనే తొమ్మిది గ్రహాలు ప్రధానంగా ఉన్నాయి అని వీటిని నవగ్రహాలు అంటారని భారతీయ శాస్త్రవేత్తల నిర్ణయం .అన్ని గ్రహాలలో చిన్న గ్రహమేమో బుధుడు పెద్ద గ్రహమేమో గురుడు. అన్ని గ్రహాలలో బుధ గ్రహము సూర్యునికి చాలా దగ్గరగా ఉండే గ్రహం. సూర్యునికి చాలా దూరంగా ఉండే గ్రహం ఫ్లూటో. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం చేయడానికి 365 రోజులు పడుతుంది. కాబట్టి , ఈ కాలాన్ని మనము ఒక సంవత్సరం అని భావించుకున్నాము. దీన్నే ‘భూ సంవత్సరము ‘అని అంటారు. బుధ గ్రహం సుఖ గ్రహం ఫ్లూటో గ్రహాలకు ఉపగ్రహాలు లేవు ,మిగతా గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. భూమికి ఒకే ఒక ఉపగ్రహం ఉంది ఆ ఉపగ్రహం పేరే ‘చంద్రుడు’. భూమి చుట్టూ 27 1/2 రోజులలో చంద్రుడు తిరుగుతూ ఉంటాడు ఒక భ్రమణాన్ని పూర్తి దీన్నే చాంద్రమానము అని అంటారు చంద్రుని మీద సూర్యుని కాంతి పడుతుంది కాబట్టి చంద్రుడు ప్రకాశంతో వెలిగిపోతుంటాడు అందుకే చంద్రుడు కాంతివంతంగా ఉన్నప్పుడు పౌర్ణమి అని కాంతి హీనమైనప్పుడు అమావాస్య అని అంటాము ఈ పౌర్ణమి అమావాస్య మధ్య కాలము 15 రోజులు. దీన్నే ఒక పక్షం అని అంటాం. ఈ పక్షాన్ని ఇంగ్లీషులో ఫోర్ట్ నైట్ అని అంటారు.భూమి చుట్టూ వాతావరణం ఉంటుంది ఈ వాతావరణం లో ఆక్సిజన్ అనే ప్రాణవాయువు ఉండడం వలన మనం నివసించగలుగుతున్నాం ఆక్సిజన్ తో హైడ్రోజన్ మిక్సింగ్ మిశ్రమంగా నీరు ఉండడం వలన చెట్లు చేమలు పడడం వెళుతున్నాయి ఇటువంటి అద్భుతమైన వాతావరణం ఏ ఇతర గ్రహాల పైన కూడా ఇటువంటి సమతుల్య వాతావరణం లేదు కేవలం భూమి మీదనే ప్రాణాలు నిలవడానికి అవసరమైనటువంటి గాలి నీరు దొరుకుతుంది కాబట్టి భూగ్రహం చాలా గొప్ప గ్రహంగా ఇప్పటివరకు ఖగోళ శాస్త్రంలో నిలిచినటువంటి చరిత్ర .కానీ ఇంకా ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ భూమిపైన రెండు వంతుల నీరు ఉంటే ఒక వంతు భూమి ఉంది. గురుత్వాకర్షణ శక్తి వలన ఇవన్నీ సాధ్యమవుతున్నాయి.
అయితే ప్రస్తుతము జూన్ నెలలో ఉన్నాము మనం. జూన్ 21 ఒక ప్రత్యేకమైన రోజు అత్యధిక పగటి పూట సమయం కలిగిన రోజు. కొంచెం మొత్తం మీద ఈ జూన్ 21కి ఏదో ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. మన భారతీయులు ‘యోగా డే ‘అనే ప్రత్యేక రోజుగా ఏర్పరచుకున్నారు . యోగా ఫర్ వెల్నెస్ అని ఒక ఉద్దేశంతో ఏర్పరిచారు. పంచ సంగీత దినోత్సవం గా కూడా జూన్ 21 అంటూ ఉంటారు .అంతేకాకుండా కొన్ని దేశాలలో’ ఫాదర్స్ డే ‘నిర్వహిస్తూ ఉంటారు. ‘తండ్రుల దినోత్సవం’ మాతృ దినోత్సవం లాగా!
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూన్ నెల చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న నెల. రోమన్ దేవత ‘జూనో’ పేరును ఈ నెలకి పెట్టారు మనం అనుకుంటున్న బృహస్పతి భార్యకు, గ్రీకు దేవత అయిన హేరా కు సరి సమానమైనటువంటి వ్యక్తిగా జూనో ను అంటారుట. ఇలా కూడా జూన్ నెల ప్రాముఖ్యత సంతరించుకున్న నెలనే! జూన్ నెలలో గతంలో మనం గుర్తు చేసుకున్నట్టుగానే ప్రపంచ పాల దినోత్సవం ,ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం వంటివి ఆచరించే రోజులు ఉన్నటువంటి నెల. శరణార్థుల కష్టాలను గురించి విషదీకరించే నెల గాను ,పెద్దల సేవలను దుర్వినియోగం చేస్తుంటే అది తప్పు అని చెప్పే అవగాహన కలిగించే నెలగాను, వాతావరణంలో ప్రముఖమైనటువంటి గాలికి సంబంధించిన విషయాలు తెలుసుకునే నెలగాను అన్నింటికంటే ముఖ్యంగా బాల కార్మికులకు నిర్మూలన పైన అవగాహన కలిగించే రోజుగా జూన్ 14న ఇలా రకరకాల ప్రత్యేకతలు కలిగినటువంటి జూన్ నెల నడి మధ్యలో మనము ఉన్నాము ఇప్పుడు.
మనుషులం కదా !భూమితోను, భూమిపై ఉన్నటువంటి వాతావరణం తోనూ, భూమి పై నివసించే సకల జీవరాశులతోనూ మనదైనటువంటి మానవీయ స్వభావంతోనూ మనం మనుగడ సాగించాలి కాబట్టి ఈ విధంగా’ భూమి- మనుషులు ‘ ఈ ప్రాముఖ్యతను ఒకసారి సింహలోకనం చేసుకోవడం కొరకని ఖగోళ శాస్త్రం నుంచి మానవతా దృక్పథం వరకు ఓ అవగాహన గా …….!!!!