మన మహిళామణులు

శ్రీమతి గురజాడ విజయశ్రీ

గురజాడ విజయశ్రీ

తనని గూర్చి ఇలా చెప్పారు.ఆమె మాటల్లో “

నా పరిచయం.
పేరు:- గురజాడ విజయశ్రీ
తల్లిదండ్రులు :- ధనికొండ సూర్యకాంతి, రామ లింగేశ్వర రావు గార్లు
జన్మస్థలం :- కృష్ణా జిల్లా నూజివీడు దగ్గర
జంగం గూడెం
జన్మదినం:- 22-2-1949
విద్యార్హతలు:- ఓపెన్ డిగ్రీ
దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి
హిందీ ప్రవీణ, జూనియర్ హిందీ పండిట్ ట్రైనింగ్ .హిందీ మహా విద్యాలయం,ఏలూరు లో చేశాను.
భర్త:- గురజాడ అప్పారావు గారు
వృత్తి:-హిందీ ఉపాధ్యాయురాలిగా 40 సంవత్సరాల బోధనానుభవం
ప్రవృత్తి:-సాహిత్యా భిలాష–
బాల్యం నుంచి మాతృ భాషాభిమానం.
అమ్మ భక్తి పాటలు రాసేది అమ్మవారి భక్తురాలు నా చేత పాడించటం , క్రమేణ నేను కూడా పాటలు రాసేదాన్ని. సహజంగానే సాహిత్యం అంటే ఇష్టం ఏర్పడింది వివాహానంతరం శ్రీవారు గురజాడ అప్పారావు గారు నన్ను చాలా ప్రోత్సహించారు. స్కూలులో వార్షికోత్సవానికి హాస్యంగా న్యూస్ రాసి పిల్లల చేత చదివించటం, అలా అలా కవి సమ్మేళనాలలో హిందీ , తెలుగు కవితలు రాసేదాన్ని అట్లా ప్రారంభమైన సాహితీ ప్రయాణం సాగిస్తూ వచ్చాను.
ఇక–
ఆంధ్రభూమి వార,మాసపత్రికలు,చిత్ర, ఆకాశిక్,
ది క్లూటుడే, ప్రజాపతి, గణేష్ ,సాహితీ కిరణం,
క్రైమ్ టుడే , సహకార సారథి మొదలగు పత్రికలలో ను, అనేక సాహితి సంస్థల,సాహితీ ప్రియుల వ్యక్తిగత సంకలనాలలో కూడా నా కవితలు ప్రచురితం అయ్యాయి .
దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి హిందీ ఎగ్జామ్స్ రాయించి వేల సంఖ్యలో పిల్లలను తయారు చేసిన సంతృప్తి నాకు మిగిలింది. ఇక టీచర్ గా నా అనుభవాల్లో ప్రత్యేకంగా కొట్టకుండా ,పిల్లలను మనసు నొప్పించకుండా వారిలో కలిసిపోయి స్నేహభావంగా వారి లో ప్రతిభను సౌమ్యంగా
వెలికి తీయటమే నా బాధ్యతగా స్వీకరించాను సక్సెస్ అవటమే కాక, వాళ్ల అభిమానాన్ని సంపాదించుకున్నాను ఒక ఉపాధ్యాయురాలిగా ఇంతకుమించిన సంతృప్తి ఉండదు అని నేను అనుకుంటాను.
6వ తరగతి
నుంచి పదవ తరగతి వరకు ఓకే బ్యాచ్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు అయిపోయాక చివరి రోజు అందరూ నన్ను కౌగిలించుకుని ఏడిచారు. ఇది మరపురాని అనుభూతి

నాటి ముఖ్యమఁత్రి చంద్రబాబునాయుడుగారితో

కవితలు ,కథలు, వ్యాసాలు రాయటం ,కవి సమ్మేళనాలలో పాల్గొనటం ,ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో వనితా లోకంలో స్వీయ కవితా పఠనం 2015 వరకు .2016 నుంచి హైదరాబాద్ నుంచి నివాసం ఢిల్లీకి మారింది.
జీవిత సభ్యత్వాలు:-
విశ్వ సాహితి ,గోల్కొండ దర్పణం ,(హిందీ), అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ (భోపాల్, మధ్య ప్రదేశ్ )అంతర్జాతీయ (రి) సంస్థ లలో.
గురజాడ లలిత కళా వేదిక కార్యదర్శిగా నిరాటంకంగా కార్యక్రమాల నిర్వహణ (హైదరాబాద్).
ప్రచురితాలు:-
కవి సంపుటాలు
1మనసు
2తొలకరి
3 భ్రమరం
4 కొత్త వరవళ్ళు (చుక్కల శతకం
5. పసిడి మేఘాలు (పిల్లల నీతి కథలు)
అప్రచురి తాలు :-
100కు పైగా వచన కవితలు ,కొన్ని మినీ కవితలు.
200 వరకు గజల్స్. ముఖ పుస్తక సాహితీ గ్రూపుల్లోను గజల్ సంకల నాలలోను ప్రచురితం అయినాయి ,అవుతున్నాయి.
పురస్కారాలు/
బిరుదులు:- డా. బెజవాడ గోపాల రెడ్డి దామోదరం సంజీవయ్య స్మారక మినీ కవితలు కథల పోటీలలో విశ్వ సాహితి సంస్థ ద్వారా ప్రథమ బహుమతులు, సంఘమిత్ర సాంస్కృతిక సంస్థ ద్వారా విశిష్ట సేవా మిత్ర,
మేగా అవార్డు ,మానస సాంస్కృతిక సంస్థ ద్వారా ఉత్తమ రచయిత్రి , అంతర్వేది సంస్థ ద్వారా ఉత్తమ కవిత పురస్కారం, సహకార వారోత్సవాల కవితల పోటీలలో వరుసగా మూడు సంవత్సరాలు ప్రథమ, ద్వితీయ బహుమతులు. అభినందన ఆర్ట్స్ సంస్థ ద్వారా ఉత్తమ వ్యాసంగా ఎంపిక (అంశం 60లో 20)
విశ్వ సాహితి సంస్థ ద్వారా 2008 ఉత్తమ రచయిత్రి ,2011 వసంత చైతన్య ,2013 కృష్ణ చైతన్య పురస్కారాలు, ఉత్తమ గ్రంథ పురస్కారం (భ్రమరమ్ కవితా సంపుటి)
2013 అంతర్జాతీయ సంస్థ A.B.B.S.S(
(,రి. భోపాల్, మధ్యప్రదేశ్) ద్వారా సాహిత్య శ్రీ అవార్డు పొందాను.
భర్త:- డా. గురజాడ అప్పారావు గారి వివరాలు క్లుప్తంగా:-
కృష్ణాజిల్లా కైకలూరు దగ్గర కొండూరు వీరి జన్మస్థలం. కన్యాశుల్కం సృష్టికర్త గురజాడ అప్పారావు గారు, వీరి తాతగారు అన్నదమ్ముల కొడుకులు ఈ విధంగా చిన్న తాతగారు అవుతారు. వీరు సాహితి ప్రియులు. చిన్న తాత గారి సాహితీ పటిమ, వారి భావాలు పోలికలు అన్ని పుణికి పుచ్చుకున్నారు అని పెక్కుమంది
చే ప్రశంసలు అందుకున్న ధన్యులు. సహకార సంఘం (co-operative bank) లో పి.వి బ్రహ్మం గారి సంపాదకీయంలో సహకార సారధి మాస పత్రికకు రూపకల్పన చేసి ప్రచురించేవారు. ఆకాశవాణి హైదరాబాదు విజయవాడ కేంద్రాలలో పలు విషయాల పైన ప్రసంగాలు చేసేవారు. వీరి చివరి రచన గ్రామీణ ప్రగతి సోపానాలు చాలా గుర్తింపు తెచ్చింది
వీరి (జననం 19 48 ఆకస్మిక మరణం2015)

సాహిత్య శ్రీ గురజాడ విజయశ్రీ
Flat- c12-2003- Super tech, Eco village
Sector 16B, Noida (u.p)
సంచార వాణి:-9811149291

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పుస్తకం

మన మహిళాస్ఫూర్తి ప్రదాతలు: