ఆడపిల్ల జీవితం

మమత

పుట్టినప్పుడు తల్లి చాటున

పెరిగేటప్పుడు తండ్రి చాటున

వయసొచ్చాక అన్న/ తమ్ముడి చాటున

పెళ్ళయ్యాక భర్తచాటున

వృద్ధాప్యంలో పిల్లల చాటున

చచ్చాక కట్టెల చాటున

ఇలా

ఆడపిల్ల జీవితం గడప చాటునే ఆగిపోతుంది

తన బాధ కన్నీటి చాటున

తన ఆనందం పెదవులచాటున

తన కోరికలు మనసు చాటునే మగ్గిపోతున్నాయి.

Written by Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పూబాల నవ్వింది

గి జ్జి గాడి గూడు