నమ్మకంతో తొంగి చూస్తోంది పంజరంలోంచి రామచిలుక దాని పేరు “రాణి” ఎవరు వచ్చినా ఎవరండీ మీరు నమస్కారం”. “మీ పేరు ఏమిటి”? ఇలా చక్కగా మాట్లాడుతుంది అందుకే అదంటే చాలామందికి ఇష్టం
కానీ ఈరోజు “రంజిని” వస్తూనే తల తిప్పుకుంది రాణి
రంజినికి ఆశ్చర్యం వేసింది ఏమైంది దీనికి అనుకుంది పంజరం దగ్గరికి వెళ్లి “పలుకరించవా”
ప్రేమగా అంది”.. ఇంకో పక్కకి తిరిగి తల తిప్పుకుంది “రాణి”!
” ఏమిటి అలాగ” ” కారణం చెప్తే కదా అంది” రంజని!
” ఓ సో సి” !ఏమి తెలియదండి” అంది రాణి!
“అదేంటి నీ బాధ నాకెలా తెలుస్తుంది చెబితే కదా” రంజని అంది.
“అవునండి” “అన్ని చెప్పుకోవాలి మీకు”…. అయినా మీకో లెఖ్ఖా మీరేమో పెద్దగా ఉండే వాళ్ళు నేనేమో చిన్నదాని,,” అంది రాణి.
“పెద్ద , చిన్న కాదు ఎందుకు, ఈ మాటలెందుకు? అసలు విషయం చెప్పు”అంది రంజని.
“నిన్న నేను చెప్పినా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళద్దని, మరి ఎందుకు వెళ్లావు” ?
“సారీ”! “రాణి పని పడి వెళ్ళాను”
“అలా అన్నావు బాగుంది” “మనుసులో బాధపడుతున్నావా”? “దీనికి మాటలు ఎందుకు నేర్పానని”,?
” అబ్బే !అదేం కాదు అలా అనుకోకు” రాణి!
” వీళ్ళందర్నీ నీవాళ్లు అనుకుంటున్నావు! వీళ్ళెవ్వరు నీ వాళ్ళు కాదు” !అంది.
“మరి నా వాళ్ళు ఎవరు”? రంజిని అడిగింది
“నేనొక్కర్తినే, నాకే నీ మీద నిజమైన ప్రేమ, నన్నేమో పంజరంలోంచి తీసేసి బయటికి వదిలిన నన్ను పొమ్మంటే నేను బయటికి పోను ఎందుకంటే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం” అంది రాణి.
“చాలా బాగుంది”! “నాకేనా నువ్వంటే ఇష్టం లేదు” రంజని
“మాట మార్చకు, నా ప్రేమ గురించి నీతో నేను మాట్లాడుతూ ఉంటే, నీ గురించి ఎందుకు చెప్తావు
“సరే! సరేలే ఏమైనా తిన్నావా? ఎవరైనా పెట్టారా”! అంది.
“ఎవరు పెడతారు”
“అంటే ఈ రెండు రోజులు ఉపవాసమా”?
“ఆ అంతలేదు నీళ్లు ,ఉన్నాయిగా తాగాను,”
రంజని”! అంది రాణి
“ఎంత ముద్దుగా పిలుస్తావు” రంజిని
“అదే నా ప్రేమ చిలుక మాట”
“సరేలే వస్తాను… పనుంది అని ఇంట్లోకి వెళ్ళింది రంజిని… ఇల్లంతా గందరగోళంగా ఉంది ఒకపక్క అమ్మ ఎందుకో, అలా ఉంది ఎందుకు అమ్మా! అలా ఉన్నావ్”?
“నా కర్మ …ఈ ఇంట్లో ఉండడమే, నేను చేసిన పాపం”!
“అమ్మ !”నీ సోది ఆపి నిజం చెప్పమ్మా”,
“ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ చిలుక తో
బలే బాధ ఎవరు వచ్చినా ఎందుకు వచ్చారు? ఏమిటి ? ..అని ప్రశ్నలతో చంపుతుంది నోరు మూసుకోదు”!
” అమ్మా”! “అది పక్షి”…
.” దానిమీద నీకెందుకు అమ్మ కోపం”.
” నేను భరించలేను,”! “అయితే ఏం చేయమంటావ్”
” పంపించేయ్ ఏ అడవిలోకో”!
” అమ్మ !చాలా దారుణం ,..దాని పరివారం నుంచి దూరం చేసి మనం మన ఇంటికి తెచ్చుకొని పెంచి ఇప్పుడు అడవిలో వదిలితే ఎలాగమ్మా… ఇది అన్యాయం కదా…. చెప్పమ్మా”?” నాకంటే నీకు పక్షి ముఖ్యమా అది ఎక్కువైందా”?
“అవును”! “దాని ప్రాణం ఉన్నంతవరకు మనతోనే ఉంటుంది నేను దాన్ని కాపాడుకోక, “తప్పదు”?
” అయితే”!” నేను వెళ్ళిపోతాను… అమ్మా! “ఆవేశం వద్దు”!
“ఆలోచించాను వెళ్తాను”!
పంజరంలోంచి రామచిలుక బాధగా “అమ్మా! నేను నీ ముద్దుల బిడ్డని రాజీని కదా…. నన్ను వదిలిపెడతావా… ఎక్కడికెళ్తావమ్మా… నేను ఎలాగమ్మా బతికేది ..ఈ ఆలోచన నీకు ఎందుకమ్మా”? “నా కోసం ఆగవా… ఏడుపు గొంతుతో.వదలకుండా, అలా
అంటూ నుంచి. ఇంకా ఆపవే
తల్లీ ! నామాట వింటావా లేదా
ఎంతసేపూ నీ గోలేనా అంది
నువ్వు ఉంటా అంటే నే ఆపుతా లేకపోతే ఆపనే
ఆపను అంది మొండిగా.
తల్లీ! ముయ్యవే రాణమ్మా
ఉంటాను తల్లీ అంది.
అప్పుడు ఊరుకుంది.
” ఇదేమిటే పిచ్చిది… ఇలా బాధపడుతుంది.. ఇంత చిన్న ప్రాణికి….. ఉండే అభిమానం నాకు లేక పోయిందేమిటీ”? అని నవ్వింది రజనీ అమ్మ