అలలూ కలలూ
మురిపెపు ముచ్చట్లు
ఒంటరి మనసుకు
జంట మనుగడకు
నిజ ప్రతిబింబం
నిప్పులు కురిసే ఎండలో
గత స్మృతుల సవ్వడి
ఎదమీటినట్లు ఎలదేటి పాటైనట్లు
ఈ తుషార హార ధవళతలో
ఈ ఋతు ఘోష చక్ర బంధంలో
నిశీధి జావళీలు
నితాంత నందనాలు
మంచు ముత్యాలు
నవ్వుల రత్నాలు
నీదైన ముఖ మండల కేంద్రం లో
నీదైన చలివేంద్రపు హృదయం లో
తెల్లని నవ్వులు నల్లని వలయం
ఆవహించిన ఉల్లాస విలాసాలు
ఇవే గుండె గూటికి ఒప్పులు కుప్పలు!
చిత్ర కవిత రచన –
డాక్టర్ కొండపల్లి నీహారిణి ,
తరుణి సంపాదకురాలు.
చిత్రం చిత్రీకవిత రెండు సమ ఉజ్జ్వలంగా ఉన్నాయి. రెండూ సు-వర్ణ చిత్రాలే… అయితే: ఒకటి రేఖలతో-రంగులతో : మరొకటి మాట బొమ్మలతో. రెండూ ఒప్పులకుప్పలే. కుటుంబాలు సుఖసంతోషాలతో నిలబడటం ఆధునిక సమాజాలలో తప్పనిసరి గుర్తింప’వలసిన అంశం. చిత్రకారులకు సంపాదకులకు అభినందనలు.