అసలు ఏమైందంటే ..

కథ

ఘాలి లలితా ప్రవల్లిక

విజయనగరం నుండిగజపతినగరం వెళ్ళే
రోడ్డుపై ఓ బుల్లెట్ రై మంటూ దూసుకెళుతోంది . కొత్త భార్య , కొత్త బైక్ 
హుషారులో జోరుపెరిగింది రాజేష్ కి .
“వద్దండి అంత స్పీడ్ వద్దు .కొత్తదికదా కొంచెం నిదానంగానే పోదాం “హెచ్చరించింది హారతి .
“ఈ చల్లగాలి లో నువ్వలా  నన్నుపట్టుకొని కూర్చుంటే ఎంత బాగుందో తెలుసా !” భయంతో అతని నడుముచుట్టూచేతులుబిగించిహత్తుకు కూర్చున్న హారతితో చిలిపిగా అన్నాడు రాజేష్ .
సిగ్గుపడిపోతూ చేతులు వదిలేసింది హారతి .
“ఏంటి పెళ్లైవారమైన ఇంకా అమ్మాయిగారి సిగ్గువదలలేదే “ఫ్రంట్ మిర్రర్ లోంచి ఆమెనే చూస్తూ అన్నాడు రాజేష్ .
“చాల్లెండి సరసాలు  వద్దంటుంటే ఫస్ట్ షో సినిమాకి తీసుకెళ్లారు . ఇప్పుడు చూడండి 
రోడ్డంతా ఎంతనిర్మానుష్యంగా ఉందో .
రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆ  చెట్లును చూస్తే జుట్టు విరబోసుకున్న భూతాల్లా కనిపిస్తున్నాయి నాకెంతభయంగానో ఉంది 
 .”అంది హారతి .
“మనకు జీవం పోసే ఆ చెట్లు భూతాలు
లా కనపడుతున్నాయా !?! చూసే చూపుని బట్టే ఉంటుందేదైనా”.అన్నాడు రాజేష్ .
అంటే ..అంటూ ఏదో అనబోతున్న హారతి మాటలకు జరగబోయే ఉపద్రవాన్ని ఊహించినట్లుగాఅడ్డుకట్టవేస్తూ సర్లే ముందు ఏదన్నా తిందాం ప్రయాణం హడావిడిలో ఆహారాన్ని అశ్రద్దచేసాం .అక్కడ డాబా ఏదో ఉన్నట్టుంది అక్కడే దన్నా తినేసి వెళ్దాం” అన్నాడు రాజేష్ .
 “రాత్రిపూట ఎంత తొందరగా ఇంటికి వెళితే అంత మంచిది . మన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు “అంది హారతి .
“లేదు మనం  వెళ్లేసరికి లేట్ అయిపోతుంది
తినేసి వెళ్దాం” అంటూ డాబాముందు ఆపాడు రాజేష్ . టిఫిన్ తిని బయల్దేరిన వారి వెనకాతలే …. ఓ ఆటో వీరిని
ఫాలో అవుతూ వచ్చింది . వీరు వారు ఫాలో
అవుతున్న విషయం గమనించలేదు .
కొంత దూరం వెళ్ళాక హారతి” బైక్పక్కకు తీసి ఆపరా ” అని అడిగింది .
అర్థం చేసుకొన్న రాజేష్ బైక్ ను రోడ్డు పక్కకు తీసి ఆపాడు .
ఆమె చెట్టు చాటుకి వెళ్లింది .
ఫాలో అవుతున్న ఆటో ఆగింది . అందులోంచి నలుగురు వ్యక్తులు గబగబా ఇనుప రాడ్లు తీసుకొని దిగారు .
దిగుతూనేరాజేష్ మీద దాడికి పాల్పడ్డారు .
“ఎవరు మీరు  ఎందుకు నన్ను కొడుతున్నారు”దెబ్బ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అడిగాడు రాజేష్ .
ఎవరూజవాబుచెప్పలేదునలుగురూ
నాలుగు పక్కలాచేరిబలంకొద్దీఇనపరాడ్లతో కొట్టారు . 
నిశబ్దవాతావరణంలో రాజేష్ గొంతు విన్న హారతి అటువైపు చూసింది . భర్త చుట్టూ వస్తాదుల్లా ఉన్న వారినిచూసి కేకలు పెడుతూ పరుగులాంటి నడకతో అక్కడకు వచ్చింది . ఆయనేం తప్పు చేశారు . ఎందుకు కొడుతున్నారు . మీ చెల్లి లాంటిదానిని  మీ కాళ్లు పట్టుకుంటా వదిలేయండి” అంటూ బ్రతిమాలింది .
వారేం మాట్లాడలేదు .ఆమె మెడలోనగలు తీసుకొని ఆటో ఎక్కి పారిపోయారు .
అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది దెబ్బలు ఎక్కువగా తగలడంతో రక్తస్రావం అధికమై రాజేష్ ప్రాణాలు విడిచాడు .
పది నిమిషాల వ్యవధిలో అంతా జరిగిపోయింది . పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చారు . ఇన్స్పెక్టర్ సూరి కేసు టేకప్ చేసాడు . అయితే దుండగులు ఎటువంటి ఆధారాలు వదలకపోవడంతో కేసును ఛేధించడం కొంచెం కష్టమైనది సూరికి .
వారు మంకీకేప్స్ పెట్టుకొని రావడంతో ఎవరిని గుర్తు పట్టలేకపోయింది హారతి .
రాజేష్ కి ఎవరితోనూఎటువంటి శత్రుత్వాలు లేవని తేలింది . నగల కోసం చంపారు అనడానికి లేదు ఎందుకంటే హారతి నగలను తీసుకొనే క్రమంలో జరిగిన ఘర్షణలో  అతను చావలేదు . ఉద్దేశపూర్వకంగానే అతన్ని చంపినట్టుగా ఉంది . ఆలోచిస్తున్న సూరికి తళుక్కున ఒక ఆలోచన వచ్చింది .
వేరే కోణం నుంచి పరిశోధన మొదలు పెట్టాడుఇనస్పెక్టర్ సూరి .
                  ****
సూరి దృష్టి సోషల్ మీడియా మీద పడింది .
ఫేస్బుక్ , ట్విట్టర్ ,వాట్సాప్ , అన్నిట్లో రాజేష్ అకౌంట్ ను పరిశీలించారు . చివరకు ఓ నిర్ధారణకు వచ్చారు .
విజయనగరం లో ఉన్న కిశోర్ ను అరెస్ట్ చేశారు ఇన్స్పెక్టర్ సూరి .
అతని వయసు 20 ఉండొచ్చు .
ముందు ఒప్పుకోకపోయినా తర్వాత పోలీస్ దెబ్బలకు భయపడి కిషోర్ తనే సుపారీ ఇచ్చి మనుషులను పెట్టి రాజేష్ ను చంపించినట్టుగా నేరాన్ని ఒప్పుకున్నాడు .
నేరస్తుడిని చూడటానికి వచ్చిన రాజేష్ తల్లిదండ్రులు
“ఇతను ఎవరు ఇతన్ని మేము ఎప్పుడూ చూడలేదే !” అన్నారు కిషోర్ నిచూసి రాజేష్ తల్లిదండ్రులు .
“మీకు తెలియదులేండి .ముఖ పరిచయం లేని మిత్రులను అందించే ముఖపుస్తక మిత్రుడుఈ కిషోర్ మీ రాజేష్ కి .
వెటకారంగా అన్నాడు ఇనస్పెక్టర్ సూరి .
“అసలు ఇతనే హంతకుడని  మీరు ఎలా తెలుసుకోగలిగారు” అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సూరి ఇలా జవాబు చెప్పాడు .”నా ఎంక్వయిరీ లోరాజేష్  ఇరుగూ పొరుగూ వారితో పెద్దగా మాట్లాడేవాడు కాదు .
ఆఫీసు ఇల్లు తప్పించి ఇంకో లోకంతెలియదు .ఇంట్లో కూడా తనగదిలో తాను ఎప్పుడూ సిస్టం ముందే కూర్చుంటాడు అని రాజేష్ తల్లిదండ్రులు ద్వారా తెలుసుకొన్నా . నా అనుమానం నిజమైంది .రాజేష్ ఎఫ్ బి కి టిక్ టాక్ కి ఎడిక్ట్ అయ్యాడు . చాట్ హిస్టరీ చెక్ చేసా .
రాజేష్ కిషోర్ ఇద్దరూ పోటాపోటీగాపోష్టులు చేసినట్లు అర్థం అయ్యింది . అందులో ఎక్కువ లైక్ లు వ్యూస్ పొందుతున్నరాజేష్ మీద కిషోర్ కసి పెంచుకున్నట్లూ చాటింగ్ లను బట్టిఅర్థమైంది . అంతేకాదు హారతి కూడా వీళ్ళకి ఫేస్ బుక్ లో కామన్ ఫ్రెండ్.
వింటానికి హాస్యాస్పదంగా ఉన్నా ఇది నిజం . యువత పై డ్రగ్స్ కన్నా ఎక్కువగా ఈ ఫేస్బుక్ వాట్సప్ ల ప్రభావం పడుతోంది . వారిని పిచ్చివారుగా మారుస్తోంది . టిక్ టాక్ చేయొద్దన్నారని ఉరిపోసుకొని చచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు . విడాకులు తీసుకున్న వారూ ఉన్నారు .ఆ ఉన్మాదం లో 
కొట్టుకుపోతున్న వారు హంతకులుగా మారే ప్రమాదం ఉందని తలచి అనుమానంతో కిషోర్ ను ఇంటరాగేట్  చేశా . నా అనుమానం నిజమైంది చిన్నవాడు కదా వెంటనే చెప్పేసాడు .  కిషోర్ ది అన్నింటిలోనూ ముందుండాలని మనస్తత్వం  .  డబ్బున్న కుటుంబంలో పుట్టిన కిషోర్  ఎలాగైనా ముందు స్థానం పొందాలనే ఆలోచనలో ఎన్నో తప్పటడుగులు వేశాడు .
     కిషోర్ హారతిని ప్రేమించాడు. ఆమెకు తన లవ్ ప్రపోజల్ తెలియజేశారు. ఆమె అతనిని రిజెక్ట్ చేసింది. రాజేష్ పెళ్లి ఫోటోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేసినప్పుడు ఆమెను చూశాడు.
కోపంతో రగిలిపోయాడు. తనని కాదని ఆమె అతన్ని చేసుకున్నది అనే కోపం తో ఆమె మీద పగ సాధింపుగా రాజేష్ నుచంపించాలను కున్నాడు.  
ఎఫ్ బి లో రాజేష్ చేసిన అప్డేట్ పోస్ట్ ద్వారా విజయనగరం వస్తున్నాడని తెలుసుకున్న
కిషోర్ సుపారీ ఇచ్చి మరీ రాజేష్ ను చంపించాడు . అని చెప్పాడు సూరి .
అనుకోని హంతకుణ్ని పట్టుకున్న సూరి తెలివితేటల్ని సునిశిత పరిశీలన ను అందరూ మెచ్చుకున్నారు

Written by Ghali lalita Pravallika

ప్రవల్లిక కలం పేరు.
రచయిత్రి పేరు ఘాలి నాగ లలిత.బి.ఎ., బిఇడి , కొన్నేళ్లు ఉపాధ్యాయునిగా పనిచేశారు. కవిత్వం, గజల్స్, నాటికలు, కథలు, నవల రచించారు. గొలుసు నవలలు రాయిస్తుంటారు. 108 మంది రచయితలచే "మాయా లోకం" గొలుసు నవల తపస్వి మనోహరం పత్రికలో రాయిస్తున్నారు. "శ్వేత ధామం" సిరి కోన గ్రూపులో రాయించిన గొలుసు నవల రవళి మ్యాగజైన్ లో ధారవాహికగా ప్రచురిస్తున్నారు.బాలబాలికలతో "నల్లహంస" గొలుసు నవల రాయిస్తున్నారు . నిత్యం సాహిత్య సృజనతో మమేకమైన రచయిత్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తొలి  చూపులోనే

తీరున్న పల్లె