తొలి  చూపులోనే

బద్రి నాగరాణి

రాణి ఆ రోజు ఆఫీసుకని రోజులాగే బయలుదేరుతుంటే ,పుణ్యవతి వెనుక నుండి గుర్తు చేస్తుంది….. అమ్మ రాణి నిన్న రాత్రి చెప్పిన విషయం గుర్తుందిగా ,ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి నిన్ను చూసుకోడానికి పెళ్లి  వస్తున్నారని .

ఈ మాట వినగానే రుసరుసలాడుతూ అబ్బబ్బ …అమ్మా ..అకస్మాత్తుగా ఈ పెళ్లి చూపులు ఏంటి ?కనీసం మాట మాత్రమైన నాతో చెప్పలేదు.ఇలా ఆకస్మాత్తుగా రమ్మంటే ఎలాగమ్మా నాకు ఆఫీస్ లో పర్మిషన్ దొరకొద్దా ?నాకు ఇపుడే కదా ఉద్యోగం వచ్చింది కొన్ని రోజులు అయ్యాక పెళ్లి చేసుకుంట అని ఎన్ని సార్లు చెప్పాలి ?

ఆలా అంటే ఎలా రాణి మా బాధ్యత గురించి మాకు భయం ఉంటుంది కదా,నువ్వు  చేసుకోకపోతే ఎలాగమ్మా.మంచి సంబంధం అబ్బాయి చాల మంచివాడు. హ్మ్మ్ నువ్వు కూడా నా నోరు కట్టేసేయ్ …నా డాక్టర్ చదువు పూర్తి అయేవరకు నేను పెళ్లి చేసుకోను అని చెప్పానుగా పళ్ళు పాట పాట నూరుతూ అంది . పుణ్యవతి చిన్నగా నవ్వి నువ్వింకా చిన్న పిల్లవి అనుకుంటున్నావా  ఉద్యోగం వచ్చి మూడు నెలలు అవుతుంది … ఇక మంచి సంబంధం  కుదిరితే నీ మేడలో మూడు ముళ్ళు వేయిస్తే మా బాధ్యత తీరిపోతుంది అంది కళ్ళల్లో సన్నటి కన్నీటి పొరను దాచేస్తూ .

అమ్మా ..తల్లి నువ్వు కొళాయి తిప్పకు ఇపుడు ఈ యాంగ్రీ బర్డ్ ని నీ సెంటి డైలాగ్స్ తో కూల్ చేయకు అని తన తల్లి మొహాన్ని చేతుల్లోకి టెస్కొని కన్నీళ్లు తుడుస్తూ  నువ్వు చెప్పినట్టు గానే సాయంత్రం పర్మిషన్   తీసుకొని వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది .

 మధ్యాహ్నం మూడు గంటలకి రాణి ఇంటికొచ్చింది.అమ్మ నేను వచ్చేసాను అంటూ లోపలి వెళ్ళింది. పుణ్యవతి వచ్చావా రాణి పెళ్ళివాళ్ళు బయలుదేరారంతా నువ్వు చీర కట్టుకొని రెడీ ఆవు అని రాణి తో చెప్పింది. ఈరోజు ఐన కాస్త పౌడర్లు,లోషన్లు రాసుకొని చక్కగా కనపడు తల్లి …అబ్బాయికి నువ్వు నచ్చాలి కదా అంది జడ వేస్తూ.

అమ్మ నేను నా లాగే ఉంటా.. మేకప్ లు వేసి పాపం ఆ అమాయకుణ్ణి మోసం చేస్తే పెళ్లి చేసుకున్నాక చీటింగ్ కేసు పెట్టి జైలు లో పెట్టించగలడు అంది అల్లరిగా నవ్వుతు .

ఇంతలో పెళ్లి వారు రానే వచ్చారు.రండి కూర్చోండి అని మంచి నీళ్లు ఇచ్చి మర్యాదలు చేసారు రాణి వాళ్ళ అమ్మ వాళ్ళు . అమ్మాయిని పిలుస్తారా అని అబ్బాయి వాళ్ళ అమ్మ అనడంతో అలాగేనండి అంటూ పుణ్యావతి లోపలి వెళ్లి రాణి పెళ్లి వారికీ జ్యూస్ ఇవ్వమ్మా అంటూ రాణి ని టెస్కొని వస్తుంది .మొదటి పెళ్లి చూపులు కావడం తో గుండెల్లో గుబులుతో భయపడుతూ నెమ్మదిగా వచ్చి అందరికి జ్యూస్ ఇచ్చి నమస్కారం చెప్తుంది రాణి.

రాణి ని చూడగానే ఈ అమ్మాయి నాకోసమే పుట్టిందేమో అని అనుకుంటాడు అబ్బాయి.అబ్బాయిని చుసిన మొదటి చూపులోనే రాణి తన మనసులో ఇలా అనుకుంటుంది అబ్బాయి అందంగా ఉన్నాడు,మంచి వాడిలా ఉన్నాడు నన్ను అపురూపంగా చూసుకుంటాడని. ఇంతలో పెద్దలు అమ్మాయి అబ్బాయి ఏమైనా మాట్లాడుకొంటే మాట్లాడుకొని అనడంతో ఇద్దరు మాట్లాడుకుంటారు. అబ్బయి రాణి ని డాక్టర్ చదువు తప్పకుండ చదవాలా అని  అడుగుతాడు. రాణి అది నా జీవిత లక్ష్యం అనడం తో అబ్బాయి నవ్వుతు నీ ఇష్టం ఏ నా  ఇష్టం  నువ్వు చదువుకుంటా అంటే నేను చదివిస్తా అంటాడు .అపుడు రాణి మొహం లో అంతులేని ఆనందం కన్పిస్తుంది. తర్వాత అబ్బాయి నేను నీతో ఒక విషయం  చెప్పాలని ..రాణి నేను ఆర్మీ జాబ్ చేస్తున్న కాబట్టి మనం ఎప్పుడు కలిసి ఉండడం కుదరదు వీలైనపుడు మాత్రమే  నేను ఇంటికి రాగలను మరియు ఈ జాబ్ చేయడం నాకు అంతగా ఇష్టం లేదు అని చెప్తాడు.అపుడు రాణి నేను మిమ్మల్ని మరియు మీ మంచి మనసుని ఇష్టపడుతున్నాను మీ జాబ్ ని మీ డబ్బుని కాదు మీకు ఇష్టం లేనపుడు మానేయొచ్చు నేను ఉద్యోగం చేస్తా అనడంతో అబ్బాయి నా మనసుని అర్ధం చేసుకొనే అమ్మాయి ఇన్ని రోజులకి దొరికింది ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్ళికి సిద్ధపడతారు.

పెద్దలు మాట్లాడి నెల రోజుల్లోనే పెళ్లి ముహూర్తం పెడతారు. రోజులు గడుస్తూ ఉంటాయి పెళ్లి ముహూర్తం రాణే వచ్చింది.ఇప్పటివరకు రాణి ప్రశాంత్ గా  విడివిడిగా  ఉన్న ఇద్దరు మూడు ముళ్ళు వేయడంతో ప్రాణి గ మరి ఒకటిగా కలిసిపోతారు. వారి వివాహ జీవితం సంతోషంగా సాగిపోతుంది. పెళ్లి అయిన పది రోజులకే తన భర్త సెలవులు అయిపోవడం తో తిరిగి తన విధుల కోసం రాణి ని వదిలి వేలీ సమయం వచ్చింది. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు వెళ్లలేక వారి గుండె చేరువై కన్నీళ్లతో నిండిపోతుంది. ఇలా సెలవులు దొరికినపుడు ప్రశాంత్ ఇంటికొస్తుంటాడు. నా భర్త దేశం కోసం పని చేస్తున్న దృశ్యాలు మన జెండా కోసం ఎముకలు కొరికే చలి లో కస్టపడి దృశ్యాలు నా కాళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. అందరిలాగా నా భర్త తో కలిసి జీవించే అదృష్టం నాకు లేదని తలుచుకుంటూ రాణి కన్నీరు మున్నీరవుతుంది.

                                                                                                                                                                        

Written by Badri Nagarani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శపిత మందారం

అసలు ఏమైందంటే ..