శపిత మందారం

కవిత

పద్మశ్రీ చెన్నోజ్వల

అపురూప సృష్టి మాట రూపం
వేయి వేణువుల సాటి విద్యలో మ్రోగిన విజయ ఢంకా బాల్యం భద్రపరిచిన వజ్రపు హారం
అంతా సవ్యంగా సాగితే అది ఎందుకు అవుతుంది                                                          జీవితం పరువం రంగులొలికిన చిత్రం హోమగుండాన సమిధైన మధుపర్కం
హవిస్సుగా అందిన ఒంటరి పయనం
సెలవంటూ కన్నవారి నిష్క్రమణం
చక్రం తిప్పిన శవరాజకీయం మూడు వ్యాధులు మృగాలై చేసిన ముప్పేట దాడి
అదుపు తప్పుతున్న దేహయంత్రం అయినా
ఉద్యోగ సాధనకు కట్టుకున్న దీక్షాకంకణం
పోటీ పరీక్షలకు సమాయత్తం
కఠోర దీక్షకు దక్కిన శ్రమ ఫలం
భారం అనుకున్న బంధాలు బహుదూరం
ఊహకందని పరిస్థితులతో సతమతం
అనుభవాలు నేర్పిన సరికొత్త పాఠాలు
చేయి చాచిన చెలిమి ఊతమైన మానవత
జీవన ఫలసారాన్ని పంచి పెడుతూ అవసరమైన చోట ఆత్మవిశ్వాసాన్ని                                                          పాదుకొలుపుతూ విరామమెరుగని దినచర్యతో అందరికీ                                                                                          ఉక్కు సంకల్పానికి సరికొత్త నమూనాగా ఆమె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆత్మవిశ్వాసం

తొలి  చూపులోనే