మన మహిళామణులు

గోశాల వెంకటనర్సమ్మ గారు

తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కట్టుంగ అనే పల్లెలో పుట్టిన ఈమె తన జీవిత విశేషాలు చెప్తుంటే అద్భుతంగా అనిపించింది.ఆమె మిలటరీ పోలీస్ భార్యగా ఎన్నో విషయాలు చెప్పారు.ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
“మాఅమ్మ నాన్న వ్యవసాయం పొలం పనులు చూసుకునే వారు.అస్సలు చదువు కోలేదు.కానీ పెద్ద కూతురు ని నన్ను మాపల్లెలోని బడిలో వేశారు.5వక్లాస్ దాకా అక్కడే చదివాను.6వక్లాస్ ఆత్రేయపురం కోఎడ్యుకేషన్ బడిలో చదివాను.మహాత్మాగాంధి హైస్కూల్ ఇప్పటికీ ఉంది.

గోశాల వెంకట నర్సమ్మ

ఆతర్వాత అంత్రేయపురం కో ఎడ్యుకేషన్ బడిలో చదివాను.పొద్దుట 8కి బైలుదేరి సాయంత్రం 5కి నడుచుకుంటూ వెళ్ళి రావటం.సంచీలేదు.పుస్తకాలు చేత్తో పట్టుకుని అరటిపళ్ళు చెరుకు గడలు తీసుకుని బైలు దేరేదాన్ని.అవన్నీ దారిలో ఓ ఇసుక దిబ్బ లో దాచి పైన అంతా కప్పేసేవారం.మానాన్న నలుగురు అన్ని దమ్ములు జాయింట్ ఫామ్లీ.మా పల్లెలో నేను ఒక్కదాన్నే బడికి వెళ్ళింది.నాచేత భరతమాత వేషం వేయించే వారు.బుడ్డీదీపం వెలుగు లో రాత్రి అంతా నిద్ర పోయాక చదివేదాన్ని.పేడ నల్లమట్టితో ఇల్లు అలకటం సుద్దతో ముగ్గులు పెట్టేదాన్ని.నేను 7వక్లాస్ లో ఉండగా మిలటరీ లో పనిచేస్తున్న మేనబావతో పెళ్లి ఐంది.ఆయన సరిహద్దుల్లో ఉంటే నేను ఇంటర్ పూర్తి చేశాను.పాప పుట్టినాక ఢిల్లీ తీసుకుని వెళ్లారు మా ఆయన.రైలు ప్రయాణం భాష రాదు.అలసి పోయాను.ఆయన డ్యూటీ కెళ్ళి పోయెరోజు జ్వరంతో ఆస్పత్రిలో చేర్పించారు.చిన్నపాప తో అలా పదిరోజులు ఉన్నాను.ఆయన రోజు రావటం లేదు.మిలటరీ డ్యూటీ అలాంటిది.

అప్పుడే అంబాలా హర్యానా చండీగఢ్ ఇలా మాకుటుంబాలు ట్రక్కు లో తిరిగాం.ఓఏడాది కాగానే రూల్స్ ప్రకారం భార్య పిల్లలని వారి పుట్టింటికి పంపేస్తారు.అక్కడ హిందీ ఇంగ్లీష్ నేర్చుకున్నాను.చైనా యుద్ధం అప్పుడు ఆయన యుద్ధభూమిలో ఉన్నారు.
ఆయన రిటైర్ ఐనాక బి.డి.ఎల్.లో జాబ్ వచ్చింది.ఓబాబు పాప
పుట్టారు. ఇల్లు కొనటం పిల్లల పెళ్ళిళ్ళు కావటంతో కాస్త స్థిమితపడ్డాను.కానీ నాభర్త కొడుకు మరణించటం నాకు షాక్!కోడలు టీచర్.మనవరాలు బి.టెక్ చదువు తోంది.చిన్నామె టెన్త్ మొన్న పాసైంది.ఇప్పటికీ ఊరగాయలు రకరకాల స్వీట్స్ చేస్తాను” .ఒక మిలిటరీ చిరు ఉద్యోగి భార్యగా ఆమె అనుభవాలు తరుణి తో పంచుకున్నారు.వెంకట నర్సమ్మ గారి కి ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సులోచనాలోచనలు

పుట్టెడు బుద్ధులు