అబ్బాయిలంతా కట్నం తీసుకోమని అమ్మాయిలే మా బంగారాలు అనంటే
ఎంత బాగుంటుంది?
భర్తలను భార్యలు గృహహింస నెపంతో బెదిరించకుంటే
కలిసి మెలిసి కాపురాలు గుట్టుగా చేసుకుంటే
ఎంత బాగుంటుంది ?
అత్తలందరూ కోడళ్ళను కూతుర్లులా అక్కున చేర్చుకుని ఆప్యాయత కురిపిస్తే
అమ్మలా అత్తమ్మను చూసుకుంటూ బిడ్డగా మరిపిస్తే
ఎంత బాగుంటుంది ?
అవినీతి సమూల నాశనం. రాజకీయ నాయకుల సంకల్పం అయితే
ప్రజల సంక్షేమమే అభివృద్ధి అని పాలకులు- పట్టు బట్ట గలిగితే
ఎంత బాగుంటుంది ?
ఆడపిల్లలను అప్పచెల్లెళ్ళ లా ఆప్యాయత నందించే అమ్మల్లాగా
ఓ స్త్రీమూర్తిలా గౌరవిస్తూ
అనురాగాల హరివిల్లులా తలచి
ప్రాణమిల్లితే
ఎంత బాగుంటుంది?