తరాలు అంతరాలు

కథ

అమ్మ శారదా! నిద్ర లేస్తావా! స్కూల్ కి వేళ అవుతోంది. ” అంటూ సుజాతమ్మ గారు కూతురిని నిద్ర లేపారు. శారద నిద్రలేస్తూనే దైవధ్యానం చేసుకొని, అక్కడ ఉన్న అద్దంలో తన ముఖం చూచుకుంటుంటే గతం జ్ఞాపకం వచ్చింది. తండ్రి లేని తనని తల్లి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. బి ఏ బి ఈ డి దాకా చదివించింది. సంపాదనపరురా లి ని చేసింది. దగ్గర బంధువులలోని అబ్బాయికి చ్చి వివాహం కూడా చేసింది. కానీ తర్వాత దురదృష్టం కొద్ది పెళ్లయిన ఏడాదికే అలవి గాని జబ్బు చేసి మరణించాడు. అత్తవారింట తనకు స్థానం దక్కలేదు. ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్న తనని సమాజం ” విధవ ” అని నామకరణం చేసి అన్నిటికీ దూరంగా ఉంచారు.

కామేశ్వరి

ఆ మధ్య అమ్మతో కలిసి బంధువులు ఇంటికి పెళ్లికి పెడితే ” ఏమే సుజాత నీకు పట్టిన గతే నీ కూతురు కూడా పట్టింది. తగు దున్నమ్మ అంటూ అన్నిటికీ హాజరవుతారు. మీరు దేనికి పనికి వస్తారు. పసుపు కుంకాలు తీసుకోవ డా నికా, వాయనం అందుకోవడానికా ” అంటూ పినత్త గారు సాగదీసింది. దానికి శారదకు కోపం వచ్చి ” బామ్మ! మాకు భర్త అయితే లేడు గాని మేము మనుషులమే కదా! రక్త మాంసాలు ఉన్నాయి. మీ జీన్స్ ఉన్నాయి, మీ డీఎన్ఏ కూడా ఉంది నాలో. బయట నుంచి వచ్చిన భర్త అనుబంధమే కదా పోయింది. ఈ లోకంలో ఎవడు శాశ్వతం కాదు బతకడానికి. ఒకరు ముందు ఒకరు వెనుక అంతే . పదమ్మ పోదాం! ఆడదే ఆడదాని కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతోంది ” అంటూ బయటికి నడిచింది
బయటకు నడిచిందే కానీ మనసు తీవ్రంగా గాయపడింది. ఒక్కసారి మనసు గతంలోకి జారింది”. తన మూడేళ్ల వయసులోనే తండ్రి చనిపోతే తన తాత తన తల్లిని ఒక వితంతు శరణాలయంలోచేర్పించారు. అమ్మ రోజుల్లో చదువుకోలేదు.ఆడపిల్లను బయటకు పంపించేవారు కాదు. బాల్య వివాహం కూడా చేశారు. వితంతు శరణాలయంలో చేరిన అమ్మకు కుట్లు, అల్లికలు అప్పడాలు వడియాలు లాంటివి చేసి ఇంటింటికి అమ్మడం లాంటి పనులు చేయించేవారు. తను తాతా నాయనమ్మ దగ్గరే ఉండేది. అమ్మ వితంతు శరణాలయంలో ఉండి కొంత. లోకజ్ఞానం సంపాదించుకుంది. తాతగారు చనిపోయిన తర్వాత మా నాన్నకి పిత్రార్జితం ద్వారా వచ్చిన సొమ్ముతో అమ్మను వేరే పెట్టారు. అమ్మ ఎంతో పొదుపుగా తనకు వచ్చిన దానిలో నన్ను చదివించి విద్యావంతురాలని కూడా చేసింది తనలా కాకుండా స్వాతంత్రంగా బతకాలని. నాకు పెళ్లి చేసి ఆ బాధ్యతను కూడా తీర్చుకుంది. ఇది విధిరాత మరో విధంగా ఉంది. తన బ్రతుకు కూడా అమ్మలాగే అయ్యింది. ఉద్యోగం చేసుకుంటూ మా బతుకు మేం బతుకుతున్నాం. సంఘం ఏమో మమ్మల్ని ఇలా ఆడిపోసుకుంటుంది. చిన్నతనంలో భర్తను కోల్పోయిన వారికి వితంతు శరణాలయాలు ఆశ్రయము ఇచ్చే ఆర్థికంగా దారి చూపించినా జీవిత చరమాంకం వరకు వారికి తోడు కావాలి కదా. అందుకననే సంఘసంస్కర్త అయిన ” కందుకూరి వీరేశలింగం గారు ‘” వితంతు వివాహాలను ఆరోజులలోనే ప్రవేశపెట్టారు వితంతువు వివాహం చేసుకోవడం తప్పుకాదని. అది పురాణాల్లో కూడా అక్కడక్కడ ప్రస్ఫుటరీకరించబడింది. కానీ ఆ కాలంలో సమాజం దానిని సమర్ధించలేదు. కాలం మారింది. నేల నుండి నింగి వరకు వ్యాపించింది మహిళ. వితంతువునైన నేను పునర్వివాహం చేసుకుంటాను. 60 ఏళ్ళు నిండిన మా అమ్మకి కూడా ఒంటరి అయినా ఒక సీనియర్ సిటిజన్ ను చూసి వివాహం చేస్తాను. రేపే ఈ విషయం మ్యాట్రిమోనిలో పెడతాను. దేవుడిచ్చిన జీవితాన్ని వృధా చేసుకోకుండా జీవిస్తాం. పదుగురికి ఆదర్శవంతంగా నిలుస్తాం. ఇక సమాజం అంటారా దానికి స్థిరమైన బుద్ధి ఎప్పుడూ లేదు ఏ ఎండకి ఆ గొడుగు పడుతుంది. అందుకే నేను దానిని ఖతర్ చేయను. “” అని చెయ్యడానికి వచ్చింది ఆదర్శవాది, విద్యావతి అయిన శారద.

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళా మణులు

ఎంత బాగుంటుంది ?