భక్తి ఉద్యమంలో 15 వ శతాబ్దంలో కృష్ణ భక్తి శాఖలో పుష్టి మార్గాన్ని నడిపి, ప్రచారం చేసిన వల్లభాచార్యునిచే రచించబడినది మధురాష్టకం.
భక్తి ఉద్యమంలోని వివిధ భక్తి భావనలలో ‘మాధుర్య భావనా భక్తి’ కూడా ఒకటి. ఈ భక్తి ప్రేయసీ ప్రియుల మధ్య ఉండే తీయ్యటి భావన లాంటిది. ఏవిధంగా ప్రియుడు ప్రేయసీ పట్ల, లేదా ప్రేయసీ ప్రియుడి పట్ల తియ్యటి మానసిక భావన కలిగి ఉంటాడో, అలాంటి భావన భక్తుడు భగవంతుని పై కలిగి ఉంటాడు. ఏవిధంగా అయితే ప్రేయసీ లేదా ప్రియుడు తమ ప్రియతమ పట్ల ఏమీ ఆశించని unconditional love కలిగి ఉంటారో అలాంటి ప్రేమ లేదా భక్తి భగవంతుని పట్ల ఈ భక్తిలో కలిగి ఉంటాడు భక్తుడు.
వల్లభుని భక్తి స్తోత్రం “మధురాష్టకం” కృష్ణునిపై ప్రేమతో నిండిన భక్తిని ప్రకటిస్తుంది, పుష్టిమార్గంలో భక్తుడిని నడిపించడానికి సృష్టించబడింది.
అష్టకం అనే పదం సంస్కృత పదం అష్ట నుండి ఉద్భవించింది , దీని అర్థం “ఎనిమిది”. ఒక అష్టకం ఎనిమిది చరణాలతో రూపొందించబడింది.
అష్టకం గీత కవిత్వ శైలికి చెందినది, ఇది చిన్నదిగా, చాలా శ్రావ్యంగా మరియు ఆలోచనాత్మకంగా ఉంటుంది. అష్టకంలోని ఇతివృత్తం లేదా పాత్ర గురించి కవి యొక్క స్వంత భావాలు, మానసిక స్థితి మరియు అవగాహనలను ప్రతిబింబిస్తుంది, చిత్రీకరిస్తుంది.
ఏవిధంగా అయితే ప్రేమికులకు తమ ప్రియతమ లోని రూపం, గుణం మాట పలుకు, నడక, నడత ఇలా ప్రియతమ అన్ని లక్షణాలు, ప్రతి చర్యా అందంగా, అద్భుతంగా, ఆనందదాయకంగా ఉంటుందో
ఈ మధురాష్టకం లో కవి తన ప్రియతమ కృష్ణుని సకల లక్షణాలూ మధురం అంటూ అభివర్ణిస్తాడు. పాఠకులను, శ్రోతలను మాధుర్య భావనలో ఓలలాడిస్తాడు.
సంస్కృతం లోని ఈ గేయ కవితను తన భాషలో అర్ధం చేసుకుంటూ పాఠకుడు కవి ఊహలలో ఉన్న శ్రీకృష్ణుని అతి సుందరమైన దివ్య విగ్రహాన్ని (great personality) నీ మైండ్ లో చిత్రికరించుకుంటాడు.
మధురాష్టకంలో కృష్ణుని రూపం, కృష్ణుని చేతలు, ఉద్దేశ్యాలు పరిసరాలు, వేణువు , ఆవులు, యమునా నది , గోపికలు మరియు కృష్ణుడి లీలలతో సహా వర్ణించ బడినాయి
పై వీడియో లో మధురాష్టకం లోని మొదట రెండు చరణాలు మాత్రమే పాడాను.
1)
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతే రఖిలం మధురమ్ ||1||
ఆతని
పెదవులు మధురం, ముఖం మధురం,
కళ్ళు మధురం, చిరునవ్వు మధురం,
హృదయం మధురమైనది, నడక మధురమైనది,
ఆ ప్రేమ స్వరూపుని గురించిన ప్రతిదీ మధురం
2)
వచనం మధురం చరితం మధురం
వాసనం మధురం వలితం మధురం |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతే రఖిలం మధురం ||2||
అతని
మాటలు మధురం, నడత మధురమైనది,
అతని దుస్తులు మధురం, భంగిమ మధురం,
అతని కదలిక మధురం, సంచారం మధురం,
ఆ ప్రేమ స్వరూపుని గురించిన ప్రతిదీ మధురం