మన మహిళామణులు

కర్లపాలెం స్వరాజ్య లక్ష్మి గారు

కర్ల పాలెం స్వరాజ్య లక్ష్మి గారు హైదరాబాద్ లో పుట్టి పెరిగారు.ఎం.ఎ.లో 4బంగారు పతకాలు పొందారు.ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నారు.భేషజం లేని ఆమె ఆధ్యాత్మిక రచనలు చేస్తున్నారు.ఆమెనిగర్వి . ఆమె మాటల్లోనే తెలుసుకుందాం ” నేను నాభర్త ఉద్యోగరీత్యా 44ఏళ్ళు నార్త్ ఇండియా లో గడిపాను.ఆయన డిఫెన్స్ లో సైంటిస్ట్.తెలుగువారు తక్కువ.హిందీ ఆంగ్లం బాగా అలవాటై డిఫెన్స్ మ్యాగజైన్స్ లో నాహిందీ ఆంగ్ల కవితలు ఇతర రచనలు పబ్లిష్ అయ్యాయి.ఊరికి చివరి మా క్వార్టర్స్.యుద్ధ సమయంలో కిటికీలకి అట్టలు లోపలి కాంతి బైటికి కన్పడకుండా పెట్టేవారం.భాషాభేదాలు లేక అంతా కలిసి మెలిసి సోషల్ వర్క్ చేసేవారం.బీదవారికి దుస్తులు అవసర సామగ్రి పంచేదాన్ని.రకరకాల కుట్లు అల్లికలు నేర్చుకున్నాను.
ఇక హైదరాబాద్ లో స్థిరపడిన తర్వాత నాకు తోచిన సోషల్ వర్క్ చేస్తున్నాను.
వరదలు వచ్చినప్పుడు బట్టలు దుప్పట్లు జామ చేసి పంపేదాన్ని. అన్నీ ఉచితం.మందులు ,జాతకం చూడటం అన్నీ ఉచితం
ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మిక వ్యాసాలు, హోమియో వైద్యం, జాతకం చూడటం ఇవి నా త్రివేణి

                  
సత్యసాయి సమితిలో హోమియో క్లినిక్ నడుపుతాము డాక్టర్లు,నేను.
నా హస్త వాసి మంచిది అని మా డాక్టర్స్ ఉవాచ.  నాకు అవార్డు రివార్డులు లేవు
శ్రీ వాణి అష్టాక్షరీ అనే మాసపత్రికలకి రామాయణం మహాభారతం లో విశేషాలు పేపర్ పై రాసి పంపుతాను.ఇప్పుడిప్పుడే స్మార్ట్ ఫోన్ లో తెలుగు టైపింగ్ చేయగలుగు తున్నాను.సంతృప్తిగా భగవచ్చింతన సమాజసేవలో జీవితం సార్ధకం చేసుకోటమే నాధ్యేయం.ఇక నేను ఎన్నో ప్రాంతాలు చూశాను.చాలామందికి తెలీని మధుర బృందావనం విశేషాలు చెప్తాను”. స్వరాజ్య లక్ష్మి గారు చెప్పిన విషయాలు మరిన్ని చదవండి మరి.
నేను స్వయంగా చూసిన బృందావనం!

మావారి ఉద్యోగరీత్యా మేము నార్త్ ఇండియా లో ఉన్నాం.నన్ను ఆకర్షించి అలౌకిక ఆనందాన్ని కలిగించిన బృందావనం గూర్చి రాస్తున్నాను.బృందావనం మధుర కృష్ణుడు నడయాడిన పవిత్ర ప్రాంతం యు.పి.లో ఉన్నాయి.కృష్ణుని బాల్యలీలలు రాధతో రాసలీలలు బృందావనం లో ఇప్పటికీ భక్తుల మనసులో కదులుతాయి.రాధారాణి దయలేనిదే బృందావనం లో ఎవరూ అడుగు పెట్టలేరు అని అక్కడివారి నమ్మకం.దగ్గరలో ఉన్న బరసాన గ్రామంలో రాధ పుట్టింది.ఒకరినొకరు రాధే రాధే అని పలకరించు కుంటారు.ఇక్కడ గోవర్ధన గిరి పర్వత ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారం తో చేస్తారు.దీపావళి మర్నాడు ఛప్పన్ని భోగం ని స్వామి కి
సమర్పిస్తారు .
బృందావనం లో ఒక శివాలయం ఉంది.పగలు పరమ శివుని కి అభిషేకాలు అర్చనలు చేస్తారు.సాయంకాలం కాగానే ఆలింగానికి గోపిక వేషం వేస్తారు.ఆయన గోపీశ్వర మహాదేవుడు.కృష్ఢుని రాసలీలలు చూడాలి అని మహాదేవుడు బృందావనం లో కి వస్తాడు గోపికా వేషంలో! అందుకే శివుని కి ఇలా భిన్న రూపాల్లో అలంకరణ ఇక్కడ జరుగుతుంది.విధివనంలో ఇప్పటికీ రాత్రి పూట రాధాకృష్ణులు విహరిస్తున్నారు అని బలంగా అక్కడివారు నమ్ముతారు.దీనిపై పరిశోధన చేయడానికి వెళ్లి నవారికి మతిభ్రమించటం కంటిచూపు పోవటం జరిగింది.

మన తెలుగు వారి ఆశ్రమం కూడా ఇక్కడ ఉంది.గుంటూరుకి చెందిన రాధికా ప్రసాద్ గారు బడేకుంజ్ లో ఆశ్రమం నెలకొల్పారు.ఆయన తర్వాత అమ్మ గారు దీన్ని నడుపుతున్నారు.ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ అక్కడ జరుగుతున్నవి.చలికాలంలో రాధాకృష్ణ విగ్రహాలకు స్వెట్టర్ మఫ్లర్ అల్లి తొడుగు తారు.ప్రతిఏడూ నేను స్వయంగా అవి అల్లి అమ్మ గారికి అందజేస్తాను.ఆమె విగ్రహాలకి తొడుగు తారు.నాజన్మ ధన్యమైనట్లు నేను భావిస్తున్నాను..రాధే రాధే”🌺
అంటారు స్వరాజ్య లక్ష్మి గారు.
కె. ఎస్. లక్ష్మి గారి నెంబర్
8008035977.
ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో పయనించే ఆమెను తరుణి కి పరిచయం చేయటంలో నాకు సంతృప్తి ఆనందం కలుగుతోంది.ఓం సాయిరాం 🌷

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెన్నతో పెట్టిన ముచ్చట్లు..

అందమైన కళా