ఎంతలా ఎదిగిందో..!!

కవిత

అరుణ ధూళిపాళ 8712342323

తెలిసో, తెలియకో…
కావాలనే అనుకున్నారో
పొరపాటునే విసిరారో
ఎప్పుడు చల్లారో నేలపైన..
ఏమని ఆత్మవిశ్వాసాన్ని నింపారో..

జలదరించిన మేఘాలు కురిసిన
గారపు సంబరాలకు తడిసి మురిసి
గిలిగింతలు పెట్టిన తనువును
చీల్చుకొని నెమ్మదిగా పెకిలిన సిగ్గరి
పుడమి నవజాత మొలక…

మురిపాలేవీ లేకున్నా
గాలి, ధూళితో చెలిమి కలిపి
తోడు లేకుండానే ఎదిగిన తరూలత
ఆటుపోట్లకు ఎదురు నిల్చిన ధీరత
పక్షి జాతులకు ఆవాసమిచ్చి
ఎగిరే రెక్కలకు ఊతమిచ్చి
ఏకసూత్రపు భావనా రాశిని
ఎరుక పరచిన భూజాత…

రాతి దెబ్బల గాయాలు,
కరుణ చూపని గొడ్డలి వేటులు,
పదును తీరిన కత్తుల కోతలు
అన్నింటినీ దిగదుడిచి
త్యాగపు చిరునగవు తెమ్మెరై
నిస్సిగ్గుల మనిషిని
కడదాకా భుజాలపై మోస్తూ
బూడిదగా రాలుతుంది తనతో పాటే…

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సారస్వత క్షేత్రంలో విరిసిన తెలుగు మహిళారత్నాలు

కవయిత్రి ఈటూరి (కస్తూరి) రమాదేవి గారు