మన మహిళామణులు

డాక్టర్ రావి శారద గారు

ఆమె తీసుకుని చేసిన వృత్తి పూర్తిగా పుస్తక ప్రపంచానికి చెందినది.పడతి పుస్తకానికి గల అనుబంధం బాల్యం నుంచి ఉంటుంది.తల్లిగా టీచర్ గా ఆమె బాధ్యత పెరుగుతుంది.అలాంటి చదువులో ఉన్నతశిఖరాలు ఎక్కిన శారద గారు తన చదువు విశేషాలు పంచుకున్నారు.ఆమె మాటల్లో…

డాక్టర్ రావి శారద గారు

“నేను విజయవాడ వాసవ్య విద్యాలయం నాస్తిక కేంద్రంలో స్కూల్ చదువు ముగించాను.మేరీస్టెల్లాలో బి.ఎస్సీ వెంకటేశ్వరయూనివర్శిటీలో బి.ఎల్.ఐ.ఎస్.సీచేశాను.ఆపైమద్రాసు యూనివర్సిటీ లో ఎం.ఎల్.ఐ.ఎస్ అనంతపూర్ శ్రీకృష్ణ దేవరాయల యూనివర్సిటీ లో పి.హెచ్.డి.చేశాను. ఆం.ప్ర.లైబ్రరీ అసోసియేషన్ కి జనరల్ సెక్రటరీని.విజయవాడ పాతూరి నాగభూషణం స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ లో ప్రిన్సిపాల్ గా చేశాను.గ్రంథాలయ సర్వస్వం ఎడిటర్ గా తరుణీ తరంగాలు కి ప్రెసిడెంట్ గా ఉన్నాను.ఇక సర్వోత్తమ గుత్తికొండ అచ్చయ్య గాడిచెర్ల ఫౌండేషన్ కి సెక్రటరీని.

ఆం.ప్ర.గాంధీ స్మారక నిధి కి జాయింట్ సెక్రటరీగా గాంధీ హిల్ ఫౌండేషన్ కి డైరెక్టర్ గా ఉన్నాను. శతవసంతసాహితీ మంజీరాలు, అనగనగా ఒక రాజు,కామయ్యగారి అనుభవాలు జ్ఞాపకాలు పుస్తకాలకు ఎడిటర్ గా చేశాను.1962_2022దాకా బాలసాహితీ సూచి bibliography of children’s literature in Telugu compiled నాకు సంతోషం సంతృప్తి కల్గించింది.
ఆంధ్ర గ్రంథాలయ పరిషద్ కి2సార్లు డైరెక్టర్ గా పని చేసాను. జనశిక్షణసంస్థకి వైస్ ప్రెసిడెంట్ నుంచి, 2016లో కళారత్న అవార్డు గ్రహీతను.

3జాతీయ 4రాష్ట్ర కాన్ఫరెన్స్ లు నిర్వహణ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి counselor for Dr.APOU IGNOU కోర్సు రైటర్ని.2వేలపైగా బాలల గ్రంధాలయాలు ఉభయతెలుగు రాష్ట్రాల బడుల్లో నెలకొల్పడం జరిగింది. BREAD basic research education and development ప్రాజెక్టు డైరెక్టర్ని.2015_2022వరకు 23ఏప్రిల్ వరల్డ్ బుక్ డే సందర్భంగా ఫ్రీగా1.5లక్షలపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది.పుస్తకాలు మస్తకాల్ని తాజాగా ఉంచుతాయి.”

అంటూ శారద గారు అన్నారంటే, వీరు సార్థక నామధేయురాలు అని అనాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నమస్కృతి

పూలవ్యాపారంలో చెన్నమ్మ దంపతులు