చిరు దరహాస రేఖలు జగతిలో నింపి
మధుర భాషణముతో సత్కృతులు నెరప
మంజుల భావనలు మదిలో వెలుగొందేలా
దీవించు మమ్ము శ్రీ రామకృష్ణ గురు దేవా!
కోటి కంఠాలు నిను అమ్మా యని పిలువగా
ఆదరించావు జగన్మాత వై,
నీ సహనశీలము మా మననులలో నిలుప వేడుకుంటామమ్మా!
కాపాడగా రావమ్మా మా శారదాంబా!
లోకానికి జ్ఞాన భిక్ష నిచ్చి,
దీనుల లో సహజ ప్రేమను పంచావు
నీ స్ఫూర్తి మా జీవితాలలో నింపి
వివేక-ఆనందాలను ప్రసాదించవయ్యా!